
యంగ్ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్(Priya Prakash Varrier) ఓ వివాదంలో ఇరుక్కుంది. ‘ఒరు అడార్ లవ్’తో ఈ మలయాళీ బ్యూటీ సినీ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో కన్ను గీటే సీన్‌తో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయింది. తనకు తొలి సినిమా చాన్స్ ఇచ్చి ఇంతటి ఫేం కి కారణమైన దర్శకుడే ఇప్పుడు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రియా మాట్లాడుతూ.. ఆ సినిమాలో హీరోకి కన్నుకొట్టే ఐడియా తనదేనని చెప్పింది.
దీంతో ఆ మూవీ డైరెక్టర్ ఓమర్ లాలూ(Omar Lulu) ఆమెపై మండిపడ్డాడు. పిచ్చిపిల్ల.. ఐదేళ్ల నాటి విషయం మర్చిపోయిందని.. జ్ఞాపకశక్తికి తైలం వాడాలంటూ వ్యంగంగా కామెంట్స్ చేశాడు. గతంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆ ఐడియా ఇచ్చింది తన కో యాక్టర్ రోషన్(Roshan) అంటూ ప్రియా చెప్పిన వీడియోను కూడా పోస్ట్ చేశాడు. ఇప్పుడు వీరిద్దరి ఫైట్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.