దేశంలో వేగంగా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు

దేశంలో వేగంగా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు

దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఈ సంఖ్య 470కిపైగా దాటిపోయింది. మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు వస్తున్నాయి. నిన్న అక్కడ మరో రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ రాష్ట్రంలో మొత్తం కేసులు 110కి చేరుకున్నాయి. రాజస్థాన్‌లో కొత్తగా 21, మహారాష్ట్రలో 2, కేరళలో 1, గుజరాత్ లో 6 , కర్ణాటకలో ఏడు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కేసులు పెరుగుతున్న, వ్యాక్సినేషన్ నెమ్మదిగా జరుగుతున్న 10 రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను ఇవాళ పంపనుంది కేంద్ర వైద్యశాఖ. రాష్ట్రాల ఆరోగ్య శాఖతో కలసి మల్టీ డిసిప్లినరీ టీమ్స్ పనిచేస్తాయని అధికారులు తెలిపారు. కాంటాక్ట్ ట్రేసింగ్, సర్వీలెన్స్, కంటెయిన్మెంట్ ఆపరేషన్స్, టెస్టింగ్, కరోనా అప్రాప్రివియేట్ బిహేవియర్, హాస్పిటల్ బెడ్స్ లభ్యత, ఆంబులెన్స్, వెంటిలేటర్స్, మెడికల్ ఆక్సిజన్  లాంటివి అందుతున్నాయా..? లేదా అనే విషయాలతో పాటు... వ్యాక్సినేషన్ ప్రోగ్రెస్ ను సెంట్రల్ టీమ్స్ పరిశీలించనున్నాయి.

కేసులు పెరుగుతుండటంతో రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.. న్యూఇయర్ సెలబ్రేషన్స్ ను నిషేధిస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్ర,యూపీ లాంటి రాష్ట్రాలు ఆంక్షలు విధించగా.. తాజాగా అసోం ప్రభుత్వం ఆంక్షలు విధించింది. నైట్ కర్ఫ్యూని పకడ్బంధీగా అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

ఇక ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ విజృంభిస్తోంది.. ఇప్పటి వరకు లక్షా 83 వేల 240 కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఒమిక్రాన్ తో ప్రపంచ వ్యాప్తంగా 31 మంది మృతి చెందారు. యూకేలో అత్యధికంగా లక్షా 14 వేలకుపైగా కేసులు ఉన్నాయి. అక్కడ 29 మరణాలునమోదయ్యాయి. డెన్మార్క్ లో 32 వేల 877 కేసులు ఉండగా.. కెనడాలో 7500 కేసులు ఉన్నాయి. ఇక అమెరికాలో 6,331 ఒమిక్రాన్  కేసులు ఉన్నాయి. మరోవైపు ఫ్రాన్స్ లో సాధారణ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఒక్కరోజే లక్ష కేసులు వచ్చాయి.