విమాన కంపెనీలకు గడ్డు రోజులు!

విమాన కంపెనీలకు గడ్డు రోజులు!

న్యూఢిల్లీ: ఇండియన్​ ఎయిర్​లైన్స్ కంపెనీల ​పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టుగా మారింది. ఒమిక్రాన్​ వేరియంట్​కేసులు పెరుగుతుండటంతో ప్యాసింజర్లు ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. టికెట్​ క్యాన్సిలేషన్లు  రోజురోజుకూ ఎక్కువ అవుతున్నాయి. ఇది చాలదన్నట్టు.. ఏవియేషన్​ టర్బైన్​ ఫ్యూయల్​ (ఏటీఎఫ్​) ధరలు చుక్కలు చూస్తున్నాయి. గత ఏడాది జూన్​ నుంచి ప్రతి నెలా ప్యాసింజర్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. థర్డ్ వేవ్​ మొదలుకాగానే సీట్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. దీంతో డిసెంబరు క్వార్టర్​లో చాలా ఎయిర్​లైన్స్ కంపెనీలు నష్టాలను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఇండియా ఏవియేషన్​ మార్కెట్​లీడర్​ ఇండిగో ఎయిర్​లైన్స్​కు డిసెంబరు క్వార్టర్​లో రూ.200 కోట్ల వరకు నష్టాలు రావొచ్చని ఐసీఐసీఐ సెక్యూరిటీస్​ తెలిపింది. ఏటీఎఫ్​ధర సీక్వెన్షియల్​గా 11 శాతం పెరిగిందని తెలిపింది. ఆర్​ఏఎస్​కే 16 శాతం పెరుగుతుందని పేర్కొంది. ఒక్కో సీటు నుంచి కిలో మీటరుకు వచ్చే ఆదాయాన్ని ఆర్​ఏఎస్​కే అంటారు. స్పైస్‌‌‌‌‌‌‌‌జెట్ లిమిటెడ్ కూడా డిసెంబర్ క్వార్టర్​లో రూ.440 కోట్ల నష్టాన్ని ప్రకటించే అవకాశం ఉందని సెంట్రమ్ ఇనిస్టిట్యూషనల్ రీసెర్చ్ వెల్లడించింది.  2022 ఆర్థిక సంవత్సరం క్యూ3లో, దేశీయ ఏటీఎఫ్  ధరలు 12.1శాతం క్వార్టర్లీ (76 శాతం) పెరిగి  రూ78.9లకు చేరాయి. బ్రెంట్ క్రూడ్ ధర క్వార్టర్లీ 8.4 శాతం పెరిగి బ్యారెల్​కు 79.4 డాలర్లు పలుకుతోందని ఎయిర్​లైన్స్​ కంపెనీలు చెబుతున్నాయి.