మన చెన్నై సిటీలోనే..:25 మంది ఉద్యోగులకు SUV కార్లు బహుమతిగా ఇచ్చిన స్టార్టప్ కంపెనీ

మన చెన్నై సిటీలోనే..:25 మంది ఉద్యోగులకు SUV కార్లు బహుమతిగా ఇచ్చిన స్టార్టప్ కంపెనీ

ప్రోత్సాహం..వ్యక్తికి స్ఫూర్తినిచ్చే, ఆత్మవిశ్వాసాన్ని పెంచే బూస్ట్ లాంటిది..ప్రతికూల పరిస్థితులను అధిగమించి లక్ష్యాలను ఛేదించే ఆయుధం వంటిది.. ప్రతిఒక్కరిలో సానుకూల దృక్పథాన్ని నింపి వారి సామర్థ్యాలను వెలికితీసి ముందుకు సాగడానికి అవసరమైన ధైర్యాన్ని ఇస్తుంది. సరిగ్గా ఇదే విషయాన్ని గుర్తించిన స్టార్టప్ కంపెనీ ఉద్యోగులకోసం ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. 

అంకిత భావం, పనిచేస్తున్న కంపెనీ డెవలప్మెంట్కు చేసిన కృషికి ఫలితం ఇది..ఎవరూ ఊహించని గిఫ్ట్..కంపెనీ అభివృద్ధికి సహకరించిన ప్రతిఒక్కరిని గుర్తించిన యాజమాన్యం..ఎంప్లాయీస్కి  వినూత్న ప్రోత్సాహం..చెన్నైలోని ఓ స్టార్టప్ కంపెనీ వెన్నంటి ఉన్న ఉద్యోగులకు ఓ వినూత్న ప్రోత్సాహం ప్రకటించింది. ఏళ్ల తరబడి కంపెనీతో అనుబంధం ఉన్న వర్కర్లకు యాజమాన్యం వార్షికోత్సవం అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చిన ఉద్యోగుల కళ్లలో ఆనందాన్ని చూసింది.  

చెన్నైకి చెందిన అజిలిసియం అనే స్టార్టప్ కంపెనీ..వార్షికోత్సవం సందర్బంగా ఉద్యోగులను వినూత్న రీతిల్లో సత్కరించింది. ఊహించని గిఫ్ట్ ఇచ్చింది.. కంపెనీ యాజమాన్యం గిఫ్ట్ ఇచ్చే వరకు ఉద్యోగులెవరికీ ఆ విషయం తెలియదు.. అంతా సీక్రెట్ గా ప్లాన్ చేసింది కంపెనీ యాజమాన్యం. 

అజిలిసియం కంపెనీ 10వ వార్షికోత్సం సందర్భంగా  కంపెనీలో అంకిత భావంతో పనిచేసిన ఉద్యోగులకు కళ్లు చెదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. ఉద్యోగులకు గిఫ్ట్ గా సరికొత్త హ్యుందాయ్ క్రెటా SUV లను ప్రోత్సాహ బహుమతిగా ఇచ్చింది. పనిపట్ల అంకిత భావాన్ని గుర్తించి అభినందించింది.  సర్ ప్రైజ్ గిఫ్ట్ తో ఉద్యోగులు ఆశ్చర్యం, ఆనందం వ్యక్తం చేశారు. అందరినీ ఆకట్టుకున్న కంపెనీ వినూత్న గిఫ్ట్ తో పాటు అన్ని స్థాయిల్లో పనితీరు ఆధారంగా జీతాలు కూడా పెంచారు. 

 సర్ ప్రైజ్ గిఫ్ట్  ఇచ్చి ఉద్యో్గుల కళ్లలో ఆనందం చూసిన కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో రాజ్ బాబు స్పందిస్తూ.. సంస్థ ఉద్యోగుల అంకిత భావాన్ని గుర్తించి ఇలాంటి ప్రోత్సాహకాలు  ఇస్తే వారి నైతికత మెరుగుపడుతుంది. సంస్థతో అనుబంధాన్ని మరింత పెంచుతుంది. ఇతరులకంటే ఎక్కువ కృషి అంకిత భావంతో పనిచేసేందుకు ప్రేరేపిస్తుందన్నారు. 

స్టార్టప్ కంపెనీ అజిలిసియం ఈ కార్యక్రమానికి సంబందించిన ఫొటోలను లింక్డ్ ఇన్ లో పోస్ట్ చేసింది. ఇది కేవలం పదవీకాల గుర్తింపు కాదు..ఇది ప్రారంభం నుంచి కంపెనీ దాతృత్వ వైఖరిని హైలైట్ చేసింది అని రాసింది.  కంపెనీ ఎదుగుదలలో దాని వెనకున్న విధేయత గత ఉద్యోగులను అభినందించేందుకు ఎప్పుడూ వెనకాడబోమని తెలిపంది అజిలిసియం. 

ఈ పోస్టుపై నెటిజన్లనుంచి భారీగానే స్పందనలు వచ్చాయి. ఉద్యోగులకు ఇంతగా విలువ ఇచ్చే కంపెనీలో భాగం కావడం నిజంగా ప్రేరణనిస్తుంది. గత దశాబ్దంలో అజిలిసియం విజయాన్ని తీర్చిదిద్దిన వారందరికీ అభినందనలు! ఈ వాతావరణంలో నేర్చుకుంటూ, ఎదుగుతున్నందుకు కృతజ్ఞతలు" అని ఒక వినియోగదారు రాశారు. 

“వావ్.. SUV లను బహుమతిగా ఇవ్వడం అనేది గొప్ప ప్రశంస! పదేళ్ళు ఒక మైలురాయి..విధేయత, జట్టుకృషికి ఇది నిజమైన వేడుకలా అనిపిస్తుంది. ఇవన్నీ సాధ్యం చేసే వ్యక్తులను కంపెనీలు గౌరవించడం చూడటం ఆనందంగా ఉంది!” అని మరో నెటిజన్ అన్నారు. సరైన గిఫ్ట్ తో విధేయతను గుర్తించిన కంపెనీ అజిలిసియం కు ధన్యవాదాలు అంటూ ఇంకో నెటిజన్ రాశారు. 

ఈ కార్యక్రమంలోనే కంపెనీ అటానమస్ ఏజెంట్ AIపై కేంద్రీకృతమై ఉన్న దాని భవిష్యత్తు రోడ్‌మ్యాప్ అయిన అజిలిసియం అదనపు 3.0 ను ఆవిష్కరించింది.