హైదరాబాద్లో మోడీ బహిరంగ సభ

హైదరాబాద్లో మోడీ బహిరంగ సభ

ఈ నెల 19 న రాష్ట్రానికి ప్రధాని మోడీ రానున్నారు.  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వందేభారత్ ట్రైన్ ను  మోడీ ప్రారంభించనున్నారు. దీంతో పాటు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది.  ఇవాళ ప్రధాని మోడీ టూరుకు సంబంధించిన ఏర్పాట్లను బీజేపీ ఎంపీ లక్ష్మణ్, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పరిశీలించారు.

జాతీయ రహదారులు రూ.1 లక్ష 4 వేల కోట్లు కేంద్రం కేటాయించిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. రైల్వే ప్రాజెక్ట్ లలోనూ కేంద్రం చొరవ చూపిందన్న ఆయన.. రూ. 2400 కోట్లతో రాష్ట్రంలో రైల్వే స్టేషన్ ల అభివృద్ధి చేస్తోందని చెప్పారు. ఎయిర్ పోర్ట్ తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు రూ.700 కోట్లతో ఆధునీకరణ పనులు చేపట్టనుందని తెలిపారు. కాజీపేట రైల్వేస్టేషన్ రూ.1100 కోట్లతో అభివృద్ధి చేయనున్నామన్న ఎంపీ లక్ష్మణ్.. ప్రధాని మోడీ సికింద్రాబాద్ నుంచి విజయవాడకు వందే భారత్ ట్రైన్ ను ప్రారంభిస్తారని చెప్పారు. తెలంగాణ ప్రజలకు ఇది నూతన సంవత్సర కానుక అని ప్రకటించారు.