సోదరుడి అంత్యక్రియల్లో జుట్టు కట్ చేసుకున్న సోదరి

సోదరుడి అంత్యక్రియల్లో జుట్టు కట్ చేసుకున్న సోదరి

ఇరాన్ లో హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. ఇరాన్ వ్యాప్తంగా మొత్తం 41 మంది చనిపోయారు. ఆందోళనల్లో మరణించిన యువకుడి అంత్యక్రియల్లో అతడి సోదరి నిరసన తెలిపిన వీడియో వైరల్ గా మారింది. జావెద్  హైదరీ అనే యువకుడు ఉద్యమంలో జరిగిన గొడవల్లో చనిపోయాడు. జావెద్  అంత్యక్రియల సమయంలో అతడి సోదరి కన్నీరు పెట్టుకుంది. ఆమె తన జట్టును కత్తిరించి జావెద్  మృతదేహంపై పడేసింది. 

ఇటీవల మహ్సా అమిని అనే 22 ఏళ్ల మహిళను మొరాలిటీ పోలీసులు అరెస్టు చేశారు. హిజాబ్ ను సరిగ్గా ధరించలేదన్న ఆరోపణలతో ఆమెను కస్టడీలో చనిపోయింది. కస్టడీలో పోలీసులు ఆమెను తీవ్రంగా హింసించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇరాన్ వ్యాప్తంగా ఆందోళనలు స్టార్ట్ అయ్యాయి. చాలా మంది మహిళలు ఇరాన్ లోని చట్టాలను వ్యతిరేకిస్తూ తమ జట్టును కత్తిరించుకొంటున్న వీడియోలను సోషల్  మీడియాలో పోస్టు చేస్తున్నారు. చాలా మంది నిరసనల్లో హిజాబ్ లను మంటల్లోకి విసురుతున్నారు.