డేటింగ్ సైట్‌ను రియల్ ఎస్టేట్ యాప్‌గా మార్చేసింది.. ఫ్లాట్ మేట్ కావాలట

డేటింగ్ సైట్‌ను రియల్ ఎస్టేట్ యాప్‌గా మార్చేసింది.. ఫ్లాట్ మేట్ కావాలట

బెంగళూరు మరోసారి భారీ అద్దె ఇండ్ల పేరుతో వార్తల్లో నిలిచింది. అక్కడ మంచి ఇంటిని కనుగొనడం ఎంత కష్టమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇటీవల 22 ఏళ్ల మహిళ డేటింగ్ యాప్‌లో ఓ అసాధారణమైన పని చేసి ఇంటర్నెట్ దృష్టిని ఆకర్షించింది. కావాల్సిన ఫ్లాట్ మేట్ ని కనుగొనడానికి, వారితో సమయం గడపడానికి వ్యక్తులు కావాలని పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కరుణా టాటా అనే మహిళ తనకు తోడుగా ఓ కొత్త ఫ్లాట్‌మేట్‌ను కనుగొనడానికి ఓ అసాధారణమైన మార్గాన్ని అనుసరించింది.. ఇది ఇంటర్నెట్ యూజర్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. కరుణ తన గదికి సంబంధించిన ప్రొఫైల్‌లను టిండర్ అండ్ హింజ్ అనే డేటింగ్ యాప్‌లలో క్రియేట్ చేసింది. ప్రేమను కనుగొనడం కోసం కాదు, కానీ తన ఫ్లాట్‌కి సరైన మ్యాచ్‌ని కనుగొనడం కోసం. ఆమె హాస్యభరితంగా తన గదికి "ఖోలీ నంబర్ 420" అని పేరు పెట్టింది. ఇది 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాలోని ఒక క్లాసిక్ బాలీవుడ్ ట్యూన్‌కి ఉల్లాసభరితమైన సూచన. తన ఫ్లాట్ కు రావడానికి ఎలాంటి ఆంక్షలు లేవని, ఫ్రెండ్స్ లా కలిసిపోయే వ్యక్తి కావాలని కోరింది. ఆమె ఈ వినూత్న విధానం టెక్ సిటీలో బాగానే వైరల్ అయింది. దీంతో చాలా మంది ఈ సంఘటనను పీక్ బెంగళూరు అని పిలుస్తున్నారు.

Is this a startup idea or a peak Bengaluru moment in desparate times? Anyways meet kholi number 420 who's on tinder to get matched with potential flatmates to replace me. @Tinder_India please make this happen. pic.twitter.com/1vBwdU9Zhb

— Karuna Tata (@starlightknown) December 21, 2023

డేటింగ్ సైట్‌ను రియల్ ఎస్టేట్ యాప్‌గా మార్చిన టిండర్ ప్రొఫైల్ సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ కావడంతో, నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. పీక్ బెంగుళూరు అంటూ అక్కడ ఫ్లాట్ దొరకడం కష్టం అనే పాయింట్‌ను ప్రతిబింబిస్తూ చెప్పారు.

Peak bengaluru https://t.co/XsZ8ekzVaC

— Abhishek Choudhary (@shreemaan_abhi) December 21, 2023