దమ్ముంటే బెట్టింగ్ పెట్టు.. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఎన్నికల మోత

దమ్ముంటే బెట్టింగ్ పెట్టు.. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఎన్నికల మోత

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు తెలంగాణ ఎన్నికల ఫీవర్ నడుస్తోంది.. గెలిచేది ఎవరు.. కేసీఆర్ సీఎం అవుతాడా లేక కాంగ్రెస్ గెలుస్తుందా.. ఇదే ఇప్పుడు ఊపేస్తుంది. ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీల తలపడుతుండటం.. గత ఎన్నికలకు భిన్నంగా పొత్తు ఈక్వేషన్స్ ఉండటంతో.. మరింత ఆసక్తి రేపుతోంది. సందట్లో సడేమియాగా.. బెట్టింగ్స్ కు తెర తేచాయి. ఈసారి పొలిటికల్ బెట్టింగ్స్.. ఏపీలోనూ జోరుగా సాగటం విశేషం. ఎటూ పేకాట లేదు.. ఆన్ లైన్ గేమ్స్ బ్యాన్.. మొన్నటికి మొన్న క్రికెట్ కూడా అయిపోయింది.. దీంతో తెలంగాణ పాలిటిక్స్ పై తెలుగు రాష్ట్రాల్లో జోరుగా సాగుతోంది బెట్టింగ్.. 

నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గెలుస్తుందంటూ జోరుగా సాగిన బెట్టింగ్స్.. క్రమంగా బీఆర్ఎస్ వైపు కూడా మొగ్గు చూపటం విశేషం. 10 రోజుల క్రితం వరకు కాంగ్రెస్ వైపు రూపాయి పెడితే రూపాయి 40 పైసలు నడిస్తే.. బీఆర్ఎస్ వైపు మాత్రం రూపాయికి 60 పైసలు నడిచింది. పోలింగ్ దగ్గర పడటం.. మరికొన్ని గంటల్లో ఓటింగ్ ప్రారంభం అవుతున్న క్రమంలో.. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీల మధ్య బెట్టింగ్ హోరాహోరీగా సాగుతుంది. ఒకటికి ఒకటి అన్నట్లు బెట్ కాస్తున్నారు. ఓవరాల్ గా కాంగ్రెస్ వైపు మొగ్గు ఎక్కువగా ఉన్నా.. ఇదే సమయంలో బీజేపీ ఎన్ని సీట్లు గెలుస్తుంది అనేది ఇంట్రస్టింగ్ పాయింట్ అయ్యింది. బీజేపీ గెలిచే సీట్ల సంఖ్యపైనా బెట్టింగ్స్ జరగటం ఆసక్తి రేపుతోంది. మొదట్లో బీజేపీ వైపు అస్సలు మొగ్గుచూపని బెట్టింగ్ రాయుళ్లు.. ఇప్పుడు వాటిపైనా డబ్బులు పెట్టటానికి ముందుకు రావటం విశేషం.

గత ఎన్నికల కంటే ఈసారి తెలంగాణ పాలిటిక్స్ పై ఏపీలో బెట్టింగ్స్ జోరుగా సాగటానికి కారణం లేకపోలేదు. కాంగ్రెస్ పార్టీకి టీడీపీ మద్దతు ప్రకటిస్తుండటం ఒకటి అయితే.. రేవంత్ రెడ్డిని టీడీపీ అనుకూల వర్గం ఓన్ చేసుకోవటం మరో కారణం. ఏపీ టీడీపీ అభిమానులు మొత్తం కాంగ్రెస్ వైపు బెట్టింగ్స్ ఎక్కువ కాస్తున్నారు. ఇదే సమయంలో సీఎం కేసీఆర్ రెండు చోట్ల నుంచి బరిలోకి దిగారు.. ఒకటి గజ్వేల్, ఒకటి కామారెడ్డి.. కేసీఆర్ రెండు చోట్ల గెలుస్తాడా లేక ఒక చోట గెలుస్తాడా.. ఏ సీటులో గెలుస్తాడు.. ఏ సీటులో ఓడిపోతాడు అనే పాయింట్ పైనా బెట్టింగ్స్ జరుగుతున్నాయి. 

హైదరాబాద్ తోపాటు ఏపీలోని ఈస్ట్, వెస్ట్, గుంటూరు, విజయవాడ కేంద్రాలుగా బెట్టింగ్స్ బాగా జరుగుతున్నాయి. వారం రోజులుగా మరింత ఎక్కువగా తెలంగాణ పాలిటిక్స్ డిస్కషన్ నడుస్తుంది. పోలింగ్ ముగిసే వరకు మాత్రమే ప్రస్తుతం ఈ రేటుపై బెట్టింగ్స్ జరుగుతుండగా.. పోలింగ్ ముగిసి కౌటింగ్ మధ్య ఇంకెంత బెట్టింగ్ జరుగుతుందో చూడాలి.. ఎగ్జిట్ పోల్స్ బయటకు వచ్చేంత వరకు ఒక రేటుగా.. పార్టీల గెలుపోటములపై ఒక రకంగా.. బీజేపీ పార్టీ గెలిచే సీట్లపై ఓ రకంగా.. బెట్టింగ్స్ జరుగుతున్నాయి. 

క్రికెట్ లో బాల్ బాల్ కు బెట్టింగ్ జరిగినట్లు.. తెలంగాణ పొలిటికల్ ఫీవర్ ఇప్పుడు బెట్టింగ్స్ లోనూ మంట పుట్టిస్తుంది. పార్టీల గెలుపోటముల కంటే బెట్టింగ్ రాయుళ్లు మాత్రం.. మేమే గెలవాలి.. మాకే డబ్బులు రావాలనే ఆశతో ఎదురుచూస్తున్నారు.