పాంగాంగ్ లేక్ బ్రిడ్జిపై.. చైనా రాకపోకలు స్టార్ట్

పాంగాంగ్ లేక్ బ్రిడ్జిపై.. చైనా రాకపోకలు స్టార్ట్

న్యూఢిల్లీ: లడఖ్ లోని పాంగాంగ్ సరస్సుపై నార్త్ నుంచి సౌత్ కు ఇదివరకే 400 మీటర్ల బ్రిడ్జి కట్టిన చైనా.. తాజాగా దానిపై రాకపోకలు స్టార్ట్ చేసింది. నల్లని రంగులో ఉన్న బ్రిడ్జిపై వెహికల్స్ తిరుగుతున్నట్లు ఈ నెల 22న మాక్సర్ సంస్థ తీసిన హై-రిజల్యూషన్ శాటిలైట్ ఫొటోల ద్వారా వెల్లడైంది. లడఖ్‌లో ఇండియా, చైనా మధ్య బార్డర్ (ఎల్ఏసీ) సమీపంలోనే ఈ వంతెన ఉంది. 

దీని గుండా చైనా జవాన్లను సరస్సు ఉత్తరం నుంచి దక్షిణ ఒడ్డుకు వేగంగా తరలించవచ్చు. ఇప్పటిదాకా చైనా బలగాలు భారత్ వైపు చేరుకోవడానికి సరస్సు తూర్పు భాగం మొత్తాన్ని దాటాల్సి వచ్చేది. కొత్త వంతెనతో వారికి 50 నుంచి 100 కి.మీ. వరకు తగ్గింది. దీంతో బార్డర్ లో మనకు మరింత ముప్పు పెరిగినట్టయింది.