కేంద్ర హోం శాఖ గ్యాలంట్రీ అవార్డుల లిస్ట్ విడుదల.. 1037 మందికి మెడల్స్

కేంద్ర హోం శాఖ గ్యాలంట్రీ అవార్డుల లిస్ట్ విడుదల.. 1037 మందికి మెడల్స్

స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్ట్ 15 పురష్కరించుకొని కేంద్ర హోంశాఖ బుధవారం గ్యాలంట్రీ అవార్డులను ప్రకటించింది.  దేశవ్యాప్తంగా పోలీసు, ఫైర్‌ సర్వీస్‌, హోంగార్డ్‌, సివిల్‌ డిఫెన్స్‌ సర్వీసులో పని చేసే 1037 మంది అధికారులకు ఈ అవార్డులను ప్రధానం చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ అవార్డుల జాబితాను విడుదల చేసింది. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని కేంద్ర హోం శాఖ ఏటా రెండు సార్లు ఈ పతకాలను ప్రకటిస్తుంది.

గ్యాలంట్రీలో 213 మెడల్స్‌, పీఎంజీలో 1 మెడల్‌, 94 మందికి పీఎస్‌ఎం మెడల్స్‌  ఇవ్వనున్నారు. ఇక గ్యాలంట్రీలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి నాలుగు మెడల్స్‌, తెలంగాణకు 7 మెడల్స్‌ దక్కాయి. మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్(MSM) కు729 మందిని ఎంపిక చేశారు. ఎంఎస్‌ఎం విభాగంలో ఏపీకి 19, తెలంగాణకు 11 మెడల్స్‌ వచ్చాయి.