
కేరళ: సెప్టెంబర్ 17ను పురస్కరించుకొని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు. భూమి కోసం, భుక్తి కోసం, బానిస సంకెళ్ల విముక్తి కోసం తెలంగాణ పోరాటం జరిగిందని రాహుల్ చెప్పారు. సెప్టెంబర్ 17 అనేది రాష్ట్ర ప్రజలకు శుభ దినమని రాహుల్ అన్నారు. నిజాం పాలన అంతం కోసం మొదలైన రైతాంగ సాయుధ పోరుకు భారత సైన్యం తోడయ్యిందని ఆయన చెప్పారు.
భూమి కోసం, భుక్తి కోసం, బానిస సంకెళ్ళ విముక్తి కోసం.. తెలంగాణ రైతాంగ పోరాటంతో మొదలుపెట్టి.. భారత సైన్యం సహాయంతో...
Posted by Rahul Gandhi on Saturday, September 17, 2022
రాష్ట్ర ప్రజల పోరాట పటిమకి తలొగ్గి నిజాం గద్దె దిగారని, అదే స్ఫూర్తిని తెలంగాణ ప్రజలు కొనసాగించాలని రాహుల్ గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ ను తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ‘భారత్ జోడో యాత్ర’ను చేపట్టారు. ప్రస్తుతం రాహుల్ యాత్ర కేరళలో కొనసాగుతోంది.