వైఎస్ షర్మిల ఆమరణ నిరాహార దీక్ష భగ్నం..అపోలో ఆస్పత్రికి తరలింపు

వైఎస్ షర్మిల ఆమరణ నిరాహార దీక్ష భగ్నం..అపోలో ఆస్పత్రికి తరలింపు

హైదరాబాద్ : వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను రెండో రోజు పోలీసులు భగ్నం చేశారు. దీక్షతో నిరసించిన షర్మిలను చికిత్స నిమిత్తం అపోలో హాస్పిటల్ కు తరలించారు. ఆస్పత్రికి తరలించే ముందే దీక్ష స్థలి వద్ద ముగ్గురు వైద్యులు షర్మిల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నారు. రాత్రి ఒంటి గంట సమయంలో వైద్యుల సూచన మేరకు షర్మిలను పోలీసులు హాస్పిటల్ కి తరలించారు. షర్మిల ఆరోగ్యం క్షీణిస్తోందని ఆమెను దీక్షా శిబిరం నుండి ఆస్పత్రికి తరలించారని తెలుస్తోంది. తాను చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లోటస్ పాండ్ లో షర్మిల ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. 

మరోవైపు.. తమ కూతురు షర్మిలను చూసేందుకు వైఎస్ విజయమ్మ జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రికి వెళ్లారు. హాస్పిటల్ వైద్యులతో మాట్లాడి షర్మిల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అపోలో హాస్పిటల్ ఎమర్జెన్సీ విభాగంలో షర్మిలను చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అంతకుముందు లోటస్ పాండ్ లో తన ఇంటి వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. 

హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు షిఫ్ట్ చేయాలె

శనివారం సాయంత్రం సిటీ న్యూరో హాస్పిటల్ డాక్టర్లు, వైఎస్ సునీతా రెడ్డి (వైఎస్ వివేకానందరెడ్డి కూతురు).. షర్మిలకు టెస్టులు చేశారు. అరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నదని డాక్టర్ తెలిపారు. 30 గంటలుగా మంచి నీళ్లు సైతం తీసుకోవడం లేదని, వెంటనే ఆసుపత్రిలో చేర్చకపోతే షర్మిల ప్రాణాలకు ప్రమాదమని హెచ్చరించారు.

లోటస్ పాండ్‌‌‌‌‌లో కర్ఫ్యూ

శనివారం కూడా లోటస్ పాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. దీక్ష వద్దకు పార్టీ కార్యకర్తలు, నేతలను పోలీసులు అను మతించలేదు. లోటస్ పాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లే అన్ని రోడ్లను బ్లాక్ చేశారు. లోటస్ పాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంటున్న ఉద్యోగులు, ఆఫీస్ స్టాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బయట నుంచి లంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సైతం పోలీసులు అనుమతించలేదు. మరోవైపు బొల్లారం పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పార్టీ అధికార ప్రతినిధి ఏపూరి సోమన్న అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం నుంచి పీఎస్ లోనే ఉంచటంతో సోమన్నకు షుగర్ లెవల్స్ పడిపోగా, వెంటనే హాస్పిటల్ కు తరలించారు. బొల్లారం పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 40 మందిని, బంజారాహిల్స్ పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏడుగురిని ఉంచినట్లు పార్టీ నేతలు తెలిపారు.