కె ర్యాంప్‌‌ మూవీ నుంచి ఓనమ్ పాట వస్తోంది..

కె ర్యాంప్‌‌ మూవీ నుంచి ఓనమ్ పాట వస్తోంది..

కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న చిత్రం ‘కె ర్యాంప్‌‌’.  యుక్తి తరేజా హీరోయిన్‌‌.  జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే టీజర్‌‌‌‌తో ఇంప్రెస్‌‌ చేసిన మేకర్స్‌‌ ఫస్ట్ సింగిల్‌‌ అప్‌‌డేట్ ఇచ్చారు. ఈనెల 9న ‘ఓనమ్‌‌’ లిరికల్‌‌ సాంగ్‌‌ను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ ఓ ఎనర్జిటిక్‌‌ ట్యూన్‌‌ను కంపోజ్ చేశాడని, కేరళ పండుగ ఓనమ్ నేపథ్యంలో సాగే ఈ పాటను మలయాళ ట్రెడిషన్ చూపించేలా కలర్ ఫుల్‌‌గా చిత్రీకరించామని దర్శకనిర్మాతలు తెలియజేశారు. 

నరేష్, సాయి కుమార్, వెన్నెల కిషోర్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్స్‌‌పై రాజేష్ దండ, శివ బొమ్మకు  నిర్మిస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా  అక్టోబర్ 18న ఈ చిత్రం విడుదల కాబోతోంది.