
హైదరాబాద్, వెలుగు : సిటీ కమిషనరేట్ పరిధిలో మరోసారి ఇన్‌స్పెక్టర్ల బదిలీలు జరిగాయి.14 మంది ఇన్‌స్పెక్టర్లను ట్రాన్స్‌ఫర్ చేస్తూ సీపీ సందీప్ శాండిల్య బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎలక్షన్ కమిషన్, ప్రిన్సిపల్ సెక్రటరీ అనుమతులతో బదిలీలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ట్రాన్స్‌ఫర్ అయిన అధికారులు సంబంధిత పోస్టుల్లో వెంటనే చార్జ్ తీసుకోవాలని ఆదేశించారు. చాదర్‌ఘాట్ డీఐ(డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్) ఎ. సీతయ్యను చిక్కడపల్లి ఎస్‌హెచ్‌వోగా నియమించారు.
ఆయన స్థానంలో ట్రాఫిక్ అడ్మిన్‌లో అటాచ్గా ఉన్న తిరుమలగిరి డీఐ గంట సంజీవకు బాధ్యతలు అప్పగించారు. బోరబండ ఎస్‌హెచ్‌వో కె. రవికుమార్‌ను సీసీఎస్‌కు బదిలీ చేసి.. ఆయన స్థానంలో ఎస్. విజయ్ను నియమించారు. అఫ్జల్ గంజ్ డీఐ లక్ష్మికాంత్ రెడ్డిని సైఫాబాద్ ఎస్‌హెచ్‌వోగా నియమించారు. సైఫాబాద్ ఎస్‌హెచ్‌వోగా ఉన్న ఎస్. రాజశేఖర్‌ను స్పెషల్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. ఈ క్రమంలోనే ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ సీఐగా గడ్డపతి నరేశ్, సౌత్‌జోన్ ఎస్‌బీ సీఐగా టి. శ్రీనాథ రెడ్డి, సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ సీఐగా శ్రీరామ్ సైదాబాబు, సైబర్ క్రైమ్ సీఐగా సైదులును నియమించారు.