
అచ్చ తెలుగు అందం శోభితా ధూళిపాళ్ల(Sobhita Dhulipala) ఓ వైపు సినిమాలు మరో వైపు వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంది. తాజాగా కపిల్ శర్మ షోకి ఈ బ్యూటీ గెస్ట్‌గా వెళ్లింది. ఈ సందర్భంగా తాను నటిని అవ్వడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘వైజాగ్‌లో చదువు పూర్తవ్వగానే ఏదైనా పెద్ద సిటీకి వెళ్లాలని కలలు కనేదాన్ని.
అందులో ముంబై, బెంగళూరు అనుకున్నాను. ఈ రెంటిలో ఒకటి డిసైడ్ చేసుకోలేక ఓ కాయిన్ తీసుకుని టాస్ వేశాను. ముంబై అని రావడంతో సిటీలో అడుగుపెట్టాను. నిజంగా ఈ నిర్ణయం నా జీవితాన్నే మార్చేసింది’అంటూ శోభితా తెలిపింది. ఇక 2013లో ఫెమినా మిస్ ఇండియా(Femina miss india) టైటిల్‌ను గెలుచుకున్న ఈ బ్యూటీ.. తర్వాత ఓ బాలీవుడ్ సినిమాతో హీరోయిన్గా మారింది. తెలుగులో అడవిశేష్(Adavi shesh)తో గూఢచారి(Gudachari) సినిమాలో హీరోయిన్గా నటించింది.