153 మంది ఎంప్లాయిలకు రూ.కోటిపైగా జీతం

153 మంది ఎంప్లాయిలకు రూ.కోటిపైగా జీతం
  • 153 మంది ఐటీసీ ఎంప్లాయిలకు రూ.కోటిపైగా జీతం 
  • వీరిలో 39 మంది కొత్త ఎంప్లాయిలు, 96 మంది మేనేజర్లు
  • హెచ్‌‌యూఎల్‌‌లో 123 మందికి రూ.కోటి జీతం

న్యూఢిల్లీ: సబ్బులు, షాంపూలు, చాక్లెట్లు, బిస్కెట్ల వంటి ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్‌‌ఎంసీజీ) వ్యాపారం చేసే ఐటీసీలో గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 153 మంది ఎంప్లాయిలకు 12 నెలల్లో కనీసం రూ.కోటి జీతం వచ్చింది. వీరిలో  96 మంది మేనేజర్లు ఉండగా,  39 మంది కొత్తగా చేరిన ఎంప్లాయిస్‌‌ కూడా ఉన్నారు. ఈ153 మంది ఎంప్లాయిల సంవత్సర జీతం ఐటీసీ  కస్టమర్‌‌ ఆదాయంలో 65 శాతం వరకు ఉంది.  గత ఆర్థిక సంవత్సరం రెవెన్యూలో వీరి జీతాలు 90 శాతానికి పైగా ఉన్నాయి.  మనదేశంలోనే అతిపెద్ద ఎఫ్‌‌ఎంసీజీ కంపెనీ  హిందుస్తాన్ యునిలివర్ లిమిటెడ్‌‌లో 123 మంది ఎగ్జిక్యూటివ్‌‌ల జీతాలు రూ.కోటి, అంతకంటే ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయంలో హెచ్‌‌యూఎల్‌‌ ని ఐటీసీ దాటేసింది.  అయితే, 2021 ఆర్థిక సంవత్సరంలో రూ.కోటి జీతమున్న ఎంప్లాయిస్‌‌ సంఖ్య 129 నుండి 123 కు  పడిపోయిందని హెచ్‌‌యూఎల్‌‌ వర్గాలు తెలిపాయి.  జీఎస్‌‌కేను విలీనం చేసుకోవడం వల్ల కార్మికుల సంఖ్య 3,500 వరకు పెరిగింది. ఈ కంపెనీ నుంచి వచ్చిన వారిలో 21 మంది ఎగ్జిక్యూటివ్‌‌లు రూ. కోటి కంటే ఎక్కువ జీతం పొందుతున్నారు. ఐటీసీ సీఎండీ సంజీవ్ పురి పే ప్యాకేజీ కూడా 2021 ఆర్థిక సంవత్సరంలో 47 శాతం పెరిగి రూ .11.47 కోట్ల నుంచి రూ .11.95 కోట్లకు చేరింది.  హెచ్‌‌యూఎల్ సీఎండీ సంజీవ్ మెహతా జీతం మాత్రం 21 శాతం తగ్గి రూ.15.4 కోట్లకు పడిపోయింది.