వైష్ణోదేవి యాత్ర మార్గంలో విరిగిపడిన కొండచరియలు .. ఒకరు మృతి

వైష్ణోదేవి యాత్ర మార్గంలో విరిగిపడిన కొండచరియలు .. ఒకరు మృతి
  • ఒకరు మృతి.. 9 మందికి గాయాలు

జమ్మూ: జమ్మూకాశ్మీర్‌‌‌‌లోని రియాసి జిల్లాలో వైష్ణో దేవి ఆలయానికి వెళ్లే మార్గంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడ భారీ స్థాయిలో కొండచరియలు విరిగిపడటంతో ఓ పర్యాటకులురాలు మృతి చెందింది. మరో 9 మంది గాయపడ్డారు. దీంతో వైష్ణోదేవి యాత్రను కొన్ని గంటల పాటు నిలిపివేశారు. ఈ ఘటన సోమవారం ఉదయం 8.30 గంటల సమయంలో బంగంగా సమీపంలోని గుల్షన్ కా లంగర్ వద్ద జరిగింది. ఇది యాత్ర ప్రారంభ స్థానం కాగా, ఇక్కడే పోనీ రైడర్స్ (గుర్రాల మీద భక్తులను తీసుకెళ్లేవారు) పాత ట్రాక్ వెంబడి భక్తులను 12కి.మీ. దూరంలో ఉన్న ఆలయానికి తీసుకెళ్తారు. 

అంతకంటే ముందు ఇక్కడ యాత్రికులు తమ పేర్లను రిజిస్టర్‌‌‌‌ చేసుకోవాల్సి ఉంటుంది. పేర్లను రిజిస్టర్‌‌‌‌ చేసుకుంటున్నప్పుడు ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడటంతో ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని, రెస్క్యూ ఆపరేషన్‌‌ చేపట్టారు. గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.