
శనివారం ఉదయం ఢిల్లీలో మరో అగ్నిప్రమాదం ప్రమాదం జరిగింది. ముండ్కా ప్రాంతంలోని ప్లైవుడ్ కర్మాగారంలో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ప్లైవుడ్ కర్మాగారంలో మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. దానికి ఎదురుగా ఉన్న బల్బ్ ఫ్యాక్టరీకి కూడా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. గత వారం అనాజ్ మండిలో జరిగిన అగ్నిప్రమాదంలో 43 మంది మరణించారు. ఆ ఘటన జరిగి వారం గడవకముందే మరో ప్రమాదం జరిగింది. మంటలను అరికట్టడానికి 21 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెస్తున్నాయి.