
కాకినాడ జిల్లా పెద్దాపురంలో వ్యభిచారం కేసు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాలతో బుధవారం ( జులై 23 ) వ్యభిచార గృహాలపై దాడులు నిర్వహించారు పోలీసులు. ఈ దాడుల్లో ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామని.. కానిస్టేబుల్, హోంగార్డ్ లను సస్పెండ్ చేసినట్లు తెలిపారు పోలీసులు.
ఒకేసారి పలు ప్రాంతాల్లో ఉన్న వ్యభిచార గృహాలపై దాడులు నిర్వహించిన పోలీసులు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పెద్దాపురం వ్యభిచారానికి సంబంధించి సోషల్ మీడియా, యూట్యూబ్ లో పలు కధనాలు వైరల్ గా మారిన క్రమంలో దాడులు నిర్వహించినట్లు తెలిపారు పోలీసులు.
వ్యభిచార గృహ నిర్వాహకురాలికి సహకరిస్తున్నారన్న అభియోగాలున్న క్రమంలో ఒక కానిస్టేబుల్. హోమ్ గార్డును సస్పెండ్ చేసినట్లు తెలిపారు ఎస్పీ బిందు మాధవి. అంతే కాకుండా పెద్దాపురం పోలీసులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. కానిస్టేబుల్ శివరామకృష్ణ, హోంగార్డ్ శివకృష్ణలను సస్పెండ్ చేశామని.. పెద్దాపురం ఎస్ఐ మౌనిక, ఇతర అధికారులపై క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు చేసినట్లు తెలిపారు.
పెద్దాపురానికి చెందిన వ్యభిచార గృహ నిర్వాహకురాలు భారతిపై కేసు నమోదు చేశామని... తావరలోనే ఆమెను అదుపులోకి తీసుకుంటామని తెలిపారు పోలీసులు. ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఎస్పీ బిందు మాధవి.