ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా వచ్చిపోయింది

ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా వచ్చిపోయింది
  • ఐసీఎంఆర్​ సీరో సర్వేలో వెల్లడి
  • డిసెంబర్​లో 3 జిల్లాల్లో 400 శాంపిళ్ల సేకరణ
  • వారిలో 97 మందికి కరోనా వచ్చి, తగ్గినట్లు గుర్తింపు
  • ఆగస్ట్–డిసెంబర్ మధ్య రాష్ట్రంలో 2 రెట్లు వృద్ధి చెందిన యాంటీబాడీస్

సికింద్రాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రతి నలుగురిలో ఒకరు కరోనా వైరస్ బారినపడి కోలుకున్నట్లు తాజాగా వెల్లడైంది. ప్రతి వంద మందికి 24 మందిలో యాంటీబాడీస్ వృద్ధి చెందినట్లు తేలింది. దేశవ్యాప్తంగా డిసెంబర్ లో ఐసీఎంఆర్ నిర్వహించిన సీరో థర్డ్ ఫేజ్ సర్వే వివరాలను నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషియన్ (ఎన్ఐఎన్) డైరెక్టర్ హేమలత మంగళవారం రిలీజ్ చేశారు. రాష్ట్రంలోని జనగామ, నల్గొండ, కామారెడ్డి జిల్లాల్లో 10 గ్రామాల చొప్పున 30 గ్రామాల్లో సర్వే నిర్వహించారు. ఒక్కో గ్రామంలో 40 శాంపిళ్ల చొప్పున మొత్తం 400 శాంపిళ్లను సేకరించారు. ఈ జిల్లాల్లోనే గత ఏడాది మేలో ఫస్ట్ ఫేజ్, ఆగస్టులో సెకండ్ ఫేజ్ సీరో సర్వే చేశారు. మే నెలలో నిర్వహించిన సర్వేలో 0.33 శాతం మందిలో, ఆగస్టులో నిర్వహించిన రెండో విడత సర్వేలో 12.5 శాతం మందిలో యాంటీ బాడీస్​ను గుర్తించారు.  ఇక డిసెంబర్​లో నిర్వహించిన సర్వేలో 24.1 శాతం మందిలో యాంటీబాడీస్ ఉన్నట్లు తేల్చారు. ఇక డిసెంబర్​లో నిర్వహించిన సర్వేలో 24.1 శాతం మందిలో యాంటీబాడీస్ ఉన్నట్లు తేల్చారు. 400 శాంపిళ్లను సేకరించి పరీక్షించగా.. 97 మందికి కరోనా వచ్చి తగ్గిపోయినట్లు గుర్తించారు. మే నుంచి డిసెంబర్ దాకా కరోనా ప్రభావం పెరిగిందని, అయినా అదే స్థాయిలో ప్రజల్లో ఇమ్యూనిటీ కూడా పెరుగుతూ వచ్చిందని సర్వే రిపోర్టులో వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఆగస్టు, డిసెంబర్ మధ్యలో 3.1 రెట్లు యాంటీబాడీస్ వృద్ధి చెందగా తెలంగాణలో 2 రెట్లు వృద్ధి చెందినట్లు వివరించారు. పరిస్థితి ఇలాగే ఉంటే గ్రామీణ జనాభాలో నాలుగింట మూడొంతుల మంది కరోనా బారిన పడే అవకాశాలు ఉన్నాయని ఐసీఎంఆర్ నోడల్ ఆఫీసర్‌ లక్ష్మయ్య హెచ్చరించారు. మాస్కులు పెట్టుకోవాలని, సోషల్ డిస్టెన్స్​పాటించాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎవరు..?

మేయర్, డిప్యూటీ మేయర్ బరిలో బీజేపీ

షర్మిల..జగన్ అన్న వదిలిన బాణం కాదు,కేసీఆర్ వదిలిన బాణం