ఆమ్లెట్ తిన్నాడని హత్య చేసిండు

V6 Velugu Posted on Nov 21, 2021

సూర్యాపేట, వెలుగు: ఆర్డర్ ఇచ్చిన ఆమ్లెట్ మరో వ్యక్తి తిన్నాడన్న కోపంతో ఆ వ్యక్తిని హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం దిర్శించర్ల  గ్రామానికి చెందిన ధరావత్ శ్రీను(35) శుక్రవారం రాత్రి పట్టణంలోని వైన్ షాపులో మద్యం తాగుతూ ఆమ్లెట్ ఆర్డర్ చెప్పాడు. అదే సమయంలో శీను పక్క టేబుల్ వ్యక్తి కూడా ఆమ్లెట్ ఆర్డర్ ఇచ్చాడు. మొదట ఆర్డర్ చేసిన వ్యక్తికి కాకుండా శ్రీనుకు ఆమ్లెట్​ఇవ్వడంతో ఇద్దరి మధ్య కొట్లాట జరిగింది. తీవ్రంగా గాయపడిన శ్రీను అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. చనిపోయిన శ్రీను డెడ్ బాడీని ఆ వ్యక్తి ఆటోలో ఖమ్మం రోడ్ లోని మూసి ఉన్న ఒక వైన్స్ షాపులో పడేసి వెళ్లిపోయాడు. మద్యం మత్తులో ఉన్న వాచ్ మెన్ తెల్లారి చూసేసరికి డెడ్ బాడీ కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సీ‌‌‌‌‌‌‌‌ఐ ఆంజనేయులు చెప్పారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

Tagged Telangana, suryapeta, scuffle, wine shop

Latest Videos

Subscribe Now

More News