వందేమాతరం చెబితే రూపాయికే లీటర్ పెట్రోల్

వందేమాతరం చెబితే రూపాయికే లీటర్ పెట్రోల్

ఆయిల్ కంపెనీలు గత రెండు నెలల్లో పెట్రోల్, డీజిల్ ధరలను 33 సార్లు పెంచాయి. ఇవాళ(జూన్ 29, మంగళవారం) పెట్రోల్ ధరను 35 పైసలు, డీజిల్ ధరను 28 పైసలు పెరిగింది. ఇలాంటి సమయంలో లీటర్ పెట్రోల్ రూపాయికే అంటూ అనౌన్స్ చేసింది ఓ సంస్థ. అయితే దాని కోసం కండీషన్ విధించింది. వందేమాతరం అని చెబితే చాలు..రూపాయికే లీటర్ పెట్రోల్ మీ సొంతం అవుతుంది. 

గుజరాత్‌లోని వడోదరలో..టీం రివల్యూషన్ అనే సంస్థ 1 రూపాయికే 1 లీటర్ పెట్రోల్ పంపిణీ చేస్తోంది. వాస్తవానికి పెరుగుతున్న ధరను, ద్రవ్యోల్బణాన్ని నిరసిస్తూ ఈ సంస్థ ఈ ప్రత్యేక మార్గం ద్వారా నిరసన తెలుపుతుంది. దీంతో  రూపాయికే 1 లీటర్ పెట్రోల్, డీజిల్ ఇస్తున్నారు. పెట్రోల్ ఇవ్వడానికి ఉన్న ఏకైక షరతు వందే మాతరం, లేదంటే భారత్ మాతా కి జై.  టీం రివల్యూషన్ సంస్థ 300 లీటర్ల పెట్రోల్ పంపిణీ చేయాలని నిర్ణయించింది.

సోమవారం ఉదయం 11 గంటల నుంచి ఈ పెట్రోల్, డీజిల్‌ను లీటరుకు రూ.1 చొప్పున పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సంస్థ అధిపతి స్వెజల్ వ్యాస్ తెలిపారు. ద్రవ్యోల్బణంతో బాధపడుతున్న ప్రజలకు మోడీ ప్రభుత్వం ఉపశమనం ఇవ్వనున్నట్లు చెప్పారు. త్వరలో పెట్రోల్, డీజిల్ రేటును తగ్గించడానికి ప్రభుత్వం తన పన్నును తగ్గించనున్నట్లు తెలిపారు.