నెల రోజుల పాలన బాగుంది : బండ్ల గణేష్

నెల రోజుల పాలన బాగుంది : బండ్ల గణేష్

హైదరాబాద్, వెలుగు: నెల రోజుల కాంగ్రెస్ పాలన చాలా బాగుందని ఆ పార్టీ నేత బండ్ల గణేశ్ అన్నారు. ప్రమాణ స్వీకారం రోజునే ప్రగతిభవన్ కంచెలు తొలగించారన్నారు. దేశంలోని ప్రతి నాయకుడూ తెలంగాణ, సీఎం గురించే మాట్లాడుకుంటున్నారని తెలి పారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చెప్పినట్టే పాలన నడుస్తున్నదని ఆదివారం ఓ ప్రకట నలో పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలను అమలు చేశారని వివరించారు. దాంతో పాటు విభజన హామీలు, నిధులపై ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులను రేవంత్, మంత్రులు కలుస్తున్నారని పేర్కొన్నారు.