గుండె పోటుతో మరో ఆర్టీసీ డ్రైవర్ మృతి

గుండె పోటుతో మరో ఆర్టీసీ డ్రైవర్ మృతి

హైదరాబాద్ ముషీరాబాద్‌ డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న రమేష్‌(38) ఇవాళ( బుధవారం) గుండెపోటుతో మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్‌ గ్రామానికి చెందిన రమేష్‌ గత 17 రోజులుగా సమ్మెలో పాల్గొన్నాడు.  రెండు రోజుల గుండెనొప్పి రావడంతో మొదట హైదరాబాద్ లోని అమ్మ హాస్పిటల్ కు తరలించారు. పరిస్థితి విషమించడంతో మలక్‌పేటలోని యశోదా ఆస్పత్రిలో ఆడ్మిట్‌ అయ్యారు. చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు.

కొద్ది రోజుల ముందు కామారెడ్డి జిల్లా  గోలి లింగాల గ్రామానికి చెందిన గఫూర్ అనే ఆర్టీసీ కార్మికుడు కూడా గుండెపోటుతో చనిపోయాడు. నిజమాబాద్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్ గా పని చేస్తున్న గఫూర్… గత నెల సాలరీ అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. మరోవైపు సెల్ఫ్ డిస్మిస్ అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు గఫూర్ ను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి.