‘వన్‌‌ నేషన్‌‌.. వన్‌‌ రేషన్‌‌’

‘వన్‌‌ నేషన్‌‌.. వన్‌‌ రేషన్‌‌’

హైదరాబాద్, వెలుగుదేశంలో ఎక్కడైనా రేషన్‌‌ తీసుకునేందుకు వీలు కల్పించే ‘వన్​నేషన్.. వన్​రేషన్’ పోర్టబిలిటీ విధానాన్ని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ మంత్రి రాంవిలాస్‌‌ పాశ్వాన్‌‌ ఢిల్లీ నుంచి ఆన్‌‌లైన్‌‌ ద్వారా  లాంఛనంగా ప్రారంభించారు. శుక్రవారం హైదరాబాద్‌‌లోని ఆదర్శ్‌‌ నగర్‌‌ న్యూ ఎంఎల్‌‌ఏ క్వార్టర్స్‌‌లోని రేషన్‌‌ షాపు నెం.1674498లో ఆన్‌‌లైన్‌‌ ద్వారా సేవలు ప్రారంభమయ్యాయి. వాచ్‌‌మెన్‌‌గా పనిచేస్తున్న రాజమండ్రికి చెందిన ఈశ్వర్‌‌ రావు పౌరసరఫరాల శాఖ కమిషనర్‌‌ అకున్‌‌ సబర్వాల్‌‌ సమక్షంలో 5 కిలోల బియ్యం తీసుకున్నారు.  పోర్టబిలిటీ విధానం అమలు, బియ్యం నాణ్యత, ఎఫ్‌‌సీఐ నుంచి బియ్యం వివరాలు కేంద్ర మంత్రి, కమిషనర్‌‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి  లబ్ధిదారుడికి అందజేసిన బియ్యాన్ని ఆన్‌‌లైన్‌‌లో పరిశీలించారు. 2018, ఏప్రిల్‌‌ 1 నుండి తెలంగాణలో పోర్టబిలిటీ అమలులో ఉందని, గడిచిన 14 నెలల్లో దాదాపు 2 కోట్ల మందికి పోర్టబిలిటీ ద్వారా సరుకులు అందించామని కమిషనర్‌‌ వివరించారు. శుక్రవారం నుంచి రేషన్​పోర్టబిలిటీ అందుబాటులోకి వచ్చిందని, వేలిముద్ర లేదా ఐరిస్​ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చని కమిషనర్​చెప్పారు. ఇప్పటి వరకు దీనిని 2 కోట్ల 10 లక్షల మంది వాడుకున్నారని తెలిపారు.