మంథని, వెలుగు: ప్రమాదవశాత్తు గోదావరి నదిలో మునిగి ఒకరు మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. మంథని మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన పంచిక సదయ్య(48), ఆదివారం బోనాల పండుగ సందర్భంగా తమ ఇంట్లో దేవుడి పూజ కోసం గంగ ఇసుక తీసుకొచ్చేందుకు గోదావరి నదిలోకి వెళ్లాడు. అవతలి ఒడ్డు వైపునకు వెళ్తూ నీటి మధ్యలో మునిగిపోయి మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. సదయ్య మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. మంథని పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు.
