
గంభీరావుపేట,వెలుగు: తేనెటీగల దాడిలో ఒకరు చనిపోగా పలువురు గాయపడ్డారు. గంభీరావుపేట మండలం లోని గోరింటాల గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. మూలవాగు మత్తడి కాలువ వద్ద ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీల మీద తేనె టీగలు ఒక్కసారిగా దాడి చేయడంతో కుమ్మరి వేణి సత్తయ్య (50) అక్కడికక్కడే మృతి చెందాడు. గాయాలైన పలువురిని హాస్పిటల్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.