సుజాతనగర్, వెలుగు: పోక్సో కేసులో ఒకరికి 20 ఏండ్ల జైలు శిక్ష, రూ.15 వేల జరిమానా విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా జడ్జి ఎస్. సరిత మంగళవారం తీర్పు చెప్పారు. వివరాలు ఇలాఉన్నాయి.
భద్రాద్రికొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం శంభునిగూడెం గ్రామానికి చెందిన కుంపటి ప్రవీణ్ కుమార్ 2022 అక్టోబర్ 23న అదే గ్రామానికి చెందిన బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అప్పటి టేకులపల్లి ఎస్సై బి .శ్రీనివాస్ కేసు నమోదు చేయగా, డీఎస్పీ ఎస్వీ రమణ మూర్తి దర్యాప్తు చేశారు. కోర్టులో 14 మంది సాక్షులను ప్రవేశపెట్టగా, నేరం రుజువు కావడంతో ఈ మేరకు తీర్పు చెప్పారు.

