
- మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో ఏకలవ్య స్కూల్స్ స్టేట్ స్పోర్ట్స్‌మీట్ షురూ
కొత్తగూడ, వెలుగు: విద్యార్థి దశ నుంచే క్రీడల్లో నైపుణ్యం సాధించాలని ఏకలవ్య స్కూల్స్ స్టేట్ ప్రిన్సిపల్సెక్రటరీ సీతాలక్ష్మి సూచించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్ళపల్లి ఏకలవ్య స్కూల్లో గురువారం స్టేట్‌లెవల్ స్పోర్ట్స్‌మీట్ ను ఆమె ప్రారంభించి మాట్లాడారు.
ఏకలవ్య స్కూళ్లలో చదివే స్టూడెంట్లు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. స్టేట్‌లెవల్ లో ఎంపికైన స్టూడెంట్లు జాతీయ స్థాయిలో రాణించి తెలంగాణకు మంచి పేరు తీసుకొని రావాలన్నారు. ప్రభుత్వం క్రీడలకు పెద్ద పీట వేస్తున్నట్లు చెప్పారు.
స్టూడెంట్ల కెరీర్ గైడైన్స్ కోసం కొత్తగా ‘తలాష్’ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. స్టేట్అడిషనల్సెక్రటరీ పి. మాధవి దేవి, స్పోర్ట్స్ ఆఫీసర్ వీరు నాయక్, ఓఎస్డీ శ్రీనివాస్,ఆర్సీవో రత్నకుమారి
పాల్గొన్నారు.