ఇప్పటిదాకా ఈసీకి దొరికింది రూ.1,862 కోట్లు

ఇప్పటిదాకా ఈసీకి దొరికింది రూ.1,862 కోట్లు

ఎన్నికల వేళ గుట్టలకొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో క్యాష్, లిక్కర్ ప్రవాహంజోరుగా సాగుతున్నట్లు ఎన్నికల సంఘం తనిఖీల్లో బయటపడింది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా నగదు, వస్తువుల విలువ కలిపి రూ.1862 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఈసీ అధికారులు మంగళవారం వెల్లడించారు. పట్టుబడ్డ మొత్తంలో నగదు రూ.506కోట్లుకాగా, లిక్కర్, డ్రగ్స్​ ఇతర వస్తువుల విలువరూ.1353కోట్లని చెప్పారు. అక్రమ తరలింపుల్లో తమిళనాడు దేశంలోనే టాప్ గా నిలిచింది. తమిళనాట 162.71కోట్ల సొత్తును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తర్వాతి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుండటం గమనార్హం.

లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలూ జరుగుతున్న ఏపీలో నగదు, లిక్కర్ కలిపి మొత్తం రూ.116.3కోట్లు పట్టుబడ్డాయి. ఇక 41.9 కోట్ల అక్రమ తరలింపులతో తెలంగాణ మూడో స్థానంలో ఉందని ఈసీ ఆఫీసర్లు చెప్పారు. ఇందులో రూ.8 కోట్లు బీజేపీకి చెందినడబ్బులే కావడం గమనార్హం. ఓటుకు నోటుతో చాలాసార్లు వార్తల్లో కెక్కిన కర్నాటకలో ఈ దఫారూ.25.71 కోట్లు మాత్రమే దొరికాయి. మరో దక్షిణాది రాష్ట్రం కేరళలో 3.84 కోట్లు, పెద్దరాష్ట్రం యూపీలోరూ.30.71 కోట్లు, పంజాబ్ లో 18.52, వెస్ట్​బెంగాల్లో 19.7కోట్లు పట్టుకున్నట్లు ఈసీ ప్రకటించింది. 543 స్థానాలున్న లోక్ సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఏడు దశల్లో జరుగనున్న సంగతి తెలిసిందే. తొలిదశలోనే ఇంత పెద్ద స్థాయిలో అక్రమాలు బయటపడిన నేపథ్యంలో తర్వాతి దశ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఈసీ తనిఖీలు ముమ్మరం చేసింది.