హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ హామీ ఇచ్చారు. గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి 'స్పౌజ్' బదిలీల కోసం 7 రోజుల పాటు దరఖాస్తు గడువు ఇస్తున్నట్లు వెల్లడించారు.
సోమవారం తెలంగాణ పంచాయతీ సెక్రటరీస్ ఫెడరేషన్ (టీపీఎస్ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు ఎ. శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో సంఘం ప్రతినిధులు ఖైరతాబాద్ పంచాయతీ రాజ్ శాఖ కార్యాలయంలో కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు తమ సమస్యలను ఆమెకు వివరించారు. వాటిలో పలు కీలక అంశాలపై కమిషనర్ సానుకూలంగా స్పందించారు.
