లాటరీలో రూ.7 కోట్లు గెలుచుకున్న చిన్నారి

లాటరీలో రూ.7 కోట్లు గెలుచుకున్న చిన్నారి

కొంతమంది పుట్టిన తర్వాత ఎన్ని పనులు చేసినా కలిసిరాదు. కానీ, కొంతమంది మాత్రం ఏం చేసినా, ఏది పట్టుకున్నా బంగారమే అవుతుంది. తాజాగా అలాంటి సంఘటనే కేరళలో జరిగింది. సంవత్సరం కూడా నిండని బాలుడి పేరు మీద లాటరీ టికెట్ కొంటే ఏకంగా రూ. 7 కోట్ల బంపర్ డ్రా తగిలింది. కేరళలో సంవత్సరం వయసున్న బాలుడు లాటరీలో రూ. 7 కోట్లు గెలుచుకున్నాడు. కేరళకు చెందిన రమీస్ రెహమాన్ దుబాయ్‌లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. అతడు తన కొడుకు మొహమ్మద్ సలాహ్ పేరు మీద రాఫిల్ డ్రాలో ఒక లాటరీ టికెట్ కొన్నాడు. సిరీస్ 323కు సంబంధించి 1319 నెంబర్ గల టికెట్‌ను రమీస్ కొన్నాడు. ఆ టికెట్ ఈ నెల తీసిన డ్రాలో ఎంపికయింది.

‘నేను కొన్న టికెట్ డ్రాలో ఎంపికయిందని తెలిసి చాలా సంతోషపడ్డాను. నా కొడుకుకి ఫిబ్రవరి 13న సంవత్సరం నిండుతుంది. తన బర్త్ డే దగ్గరికి వస్తున్న ఈ సమయంలో లాటరీలో రూ. 7 కోట్లు రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇక నా కొడుకు జీవితం సెటిల్ అయినట్లే’ అని రమీస్ అన్నాడు.

యుఏఈలో జరిగే ఇటువంటి లక్కీ డ్రాల్లో చాలా మంది భారతీయులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. గత సంవత్సరం ఇండియాకి చెందిన ఒక రైతు కూడా లాటరీలో 4 మిలియన్లు గెలుచుకున్నాడు. దుబాయ్‌లో ఉద్యోగం దొరకక ఇండియా వచ్చిన ఆ రైతు రాఫిల్ డ్రాలో 4 మిలియన్ డాలర్లకు పైగా గెలిచాడు. పైగా రైతు ఆ టికెట్‌ను అతను తన భార్య దగ్గర డబ్బులు తీసుకొని మరీ కొన్నాడు.

For More News..

ఈ ఫోన్ ధర రూ. 11.3 లక్షలు

తల్లిని, చెల్లిని రోకలిబండతో కొట్టి చంపిన యువకుడు