వన్ ప్లస్ నుంచి OnePlus 15 స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. Qualcomm Snapdragon 8 Elite Gen 5 SoC ఆపరేటింగ్ సిస్టమ్తో OnePlus 15 పనిచేస్తుంది. 7300mAh బ్యాటరీ సామర్థ్యంతో పాటు 120W క్విక్ వైర్డ్ ఛార్జింగ్ ఈ మొబైల్ స్పెషాలిటీ. చాలా త్వరగా ఛార్జింగ్ ఎక్కుతుంది. ఇక ధరల విషయానికొస్తే.. 16GB + 256GB ధర సుమారు.. 52 వేల 982 రూపాయలు, 12GB + 512GB ధర సుమారు 56 వేల 704 రూపాయలు.
16GB + 512GB ధర సుమారుగా.. 60 వేల 427 రూపాయలు, 16GB + 1TB వేరియంట్ ధర 66 వేల 590 రూపాయలు ఉండొచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. 6.78 అంగుళాల LTPO AMOLED డిస్ ప్లే, 1.5K రిజల్యూషన్, 50 మెగా పిక్సెల్ Sony IMX906 ప్రైమరీ కెమెరా, 3.5x ఆప్టికల్ జూమ్ 50 మెగాపిక్సెల్ Samsung JN5 టెలీఫొటో సెన్సార్, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వన్ ప్లస్ 15 రూపొందింది.
OnePlus 15 చైనాలో Android 16-ఆధారిత ColorOS 16 పై రన్ అవుతుంది. ఇది 6.78 ఇంచ్ థర్డ్ జనరేషన్ BOE ఫ్లెక్సిబుల్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది, 165Hz వరకు రిఫ్రెష్ రేట్ 1.5K (1,272x2,772 పిక్సెల్స్) రిజల్యూషన్, 1,800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 330Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్ మరియు 450 ppi పిక్సెల్ డెన్సిటీ కలిగి ఉంది వన్ ప్లస్ 15. స్క్రీన్ 100 శాతం DCI-P3 కలర్ గామట్, 1.07 బిలియన్ కలర్స్‌కు సపోర్ట్ చేస్తుంది ఈ న్యూలీ లాంచ్ మోడల్.
ఆప్టిక్స్ విషయానికొస్తే, OnePlus 15 లో ట్రిపుల్-రియర్ కెమెరా యూనిట్ ఉంది, దీనికి 24mm ఫోకల్ లెంగ్త్‌తో 50-మెగాపిక్సెల్ (f/1.8) ప్రైమరీ షూటర్ ఉంది. ఇందులో 50-మెగాపిక్సెల్ (f/2.0) అల్ట్రావైడ్ కెమెరా, 50-మెగాపిక్సెల్ (f/1.8) టెలిఫోటో కెమెరా కూడా ఉన్నాయి. ముందు భాగంలో, ఇది 32-మెగాపిక్సెల్ (f/2.4) సెల్ఫీ కెమెరాతో వస్తోంది. రేర్ కెమెరా సెటప్ 30 fps తో 8K రిజల్యూషన్ వీడియోలను షూట్ చేయగలదని తెలుస్తోంది. అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో ప్రీమియం మోడల్ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నవారికి వన్ ప్లస్ 15 బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు.
