ఏపీలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. ఇవాళ ఎంతంటే..

ఏపీలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. ఇవాళ ఎంతంటే..
  • 1 లక్ష 14 వేల 299 మందికి పరీక్షించగా 23 వేల 920 మందికి కరోనా నిర్ధారణ
  • 83 మంది కరోనా కాటుతో మృతి
     

అమరావతి: ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో కరోనా మహమ్మారి సునామీలా విరుచుకుపడుతోంది. గడచిన 24 గంటల్లో (శనివారం ఉదయం 9 నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు) 23 వేల 920 మందికి కరోనా నిర్ధారణ జరిగింది. 83 మంది కరోనా కాటుకు బలై తుదిశ్వాస విడిచారు. గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1 లక్షా 14 వేల 299 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 23 వేల 920 మందికి నిర్ధారణ అయిందని.. 83 మంది మరణించారని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.
జిల్లాల వారీగా మరణాలు
కరోనా మహమ్మారి సోకి చికిత్స పొందుతున్న వారిలో జిల్లాల వారీగా తూర్పుగోదావరి జిల్లాలో 12 మంది మరణించగా, విశాఖపట్టణం, అనంతపురం, కృష్ణా జిల్లాల్లో ఎనిమిది మంది చొప్పున, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ఏడుగురు చొప్పున, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆరుగురు చొప్పున మృతి చెందారు. అలాగే గుంటూరు జిల్లాలో ఐదుగురు, కర్నూలు జిల్లాలో నలుగురు చొప్పున కరోనాతో కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో గడచిన 24 గంటల్లో 11 వేల 411 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఆస్పత్రుల నుండి డిశ్చార్జి అయ్యారు. ఇవాళ్టి వరకు రాష్ట్రంలో ఒక కోటి 66 లక్షల 2 వేల 873 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. జిల్లాల వారీగా గడచిన 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.