కొనసాగుతున్న డెక్కన్ బిల్డింగ్ కూల్చివేత పనులు

కొనసాగుతున్న డెక్కన్ బిల్డింగ్ కూల్చివేత పనులు

సికింద్రాబాద్​ పరిధిలోని నల్లగుట్టలో అగ్ని ప్రమాదం జరిగిన డెక్కన్ స్పోర్ట్స్ మాల్ బిల్డింగ్ కూల్చివేత పనులు ఇంకా కొనసాగుతున్నాయి. జనవరి 26న కూల్చివేత పనులు ప్రారంభంకాగా.. 12 రోజులైనా ఇంకా పూర్తి కాలేదు. బిల్డింగ్ కూల్చివేస్తున్న సమయం లో 60 శాతం భవనం కుప్పకూలగా.. తాజాగా మరో 20 శాతం ఇవాళ కూలిపోయింది. బిల్డింగ్ చుట్టుపక్కల ఇండ్లలోకి ఎవరినీ అనుమతించకపోవడంతో బస్తీవాసులను ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కూల్చివేత పనులు 5 రోజుల్లోనే పూర్తవుతాయని భావించినా.. అనుకున్న సమయం కంటే చాలా ఆలస్యం అయింది. ఇక మరో 20 శాతం బిల్డింగ్ మాత్రమే మిగిలి ఉండడంతో ఈ రోజుతో కూల్చివేత పూర్తయ్యే అవకాశముందని కాంట్రాక్టర్లు చెబుతున్నారు.