రేపు 7 లక్షల మంది రైతులకు 1153 కోట్లు

రేపు 7 లక్షల మంది రైతులకు 1153 కోట్లు
  • కొనసాగుతున్న రైతుబంధు నిధుల పంపిణీ
  • 3  రోజులుగా 42.43 లక్షల రైతుల బ్యాంకు ఖాతాల్లో 2942.27 కోట్లు జమ

హైదరాబాద్: రాష్ట్రంలో రైతు బంధు ఆర్ధిక సహాయం పంపిణీ కొనసాగుతోంది. గత మూడు రోజులుగా 42.43 లక్షల మంది రైతుల ఖాతాలలో రైతుబంధు కింద 58.85 లక్షల ఎకరాలకు గాను రూ.2942.27 కోట్లు జమ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నాలుగో రోజూ నల్లగొండ జిల్లాకే అత్యధికంగా పంపిణీ చేసినట్లు అధికార వర్గాలు సమాచారం. నల్గొండలో 53,381 మంది రైతులకు 1,82,542 ఎకరాలకు గాను రూ.91.27 కోట్లు జమ చేసినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో అత్యల్పంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 2300 మంది రైతులకు గాను 7212 ఎకరాలకు 36.05 లక్షలు జమ చేశారు. మొత్తం నాలుగు రోజులలో రైతుబంధు కింద రైతుల ఖాతాలలో రూ.4095.77 కోట్లు జమ చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. రేపు శుక్రవారం 7.05 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.1153.50 కోట్లు జమ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.