యువకుడి ప్రాణాలు తీసిన ఆన్‌ లైన్ చాటింగ్

V6 Velugu Posted on Apr 01, 2021

నిజామాబాద్ జిల్లా : తెలియని అమ్మాయితో చాట్ చేయడం యువకుడి ప్రాణాలు పోయేలా చేసింది. నేను సింగిల్ అంటూ ఆన్‌ లైన్‌ లోకి వచ్చిన యువతి బుట్టలో పడి యువకుడు నిలువునా మోసపోయాడు. అమ్మాయి కవ్వింపు మాటలతో ఆన్‌ లైన్ చాటింగ్ చేసి అడ్డంగా బుక్కయ్యాడు. అమ్మాయి న్యూడ్‌ గా కనిపించడంతో అతడు కూడా నగ్నంగా ఆమెతో వీడియోకాల్‌ లో మాట్లాడాడు. అబ్బాయి న్యూడ్ వీడియోలు సీక్రేట్‌ గా రికార్డ్ చేసిన యువతి అతడ్ని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టింది. దీంతో పరువు పోగొట్టుకోవడం కన్నా.. ప్రాణం తీసుకోవడమే మేలని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలంలోని కోస్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకోగా స్థానికంగా కలకలం రేపింది.

 సరదాగా యువతితో ఫోన్ లో వీడియో చాట్ చేశాడు. అయితే యువకుడితో వీడియో చాట్ తర్వాత ఆ యువతి వీడియోను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసింది. దీంతో ఆ యువకుడు భయపడ్డాడు. పరువు పోతుందని ఆందోళన చెందాడు. తన బ్యాంకు అకౌంట్‌ లో ఉన్న 24 వేలు వారిచ్చిన ఖాతాకు ట్రాన్స్ ఫర్ చేశాడు. అంతటితీ ఆగకుండా ఇంకా డబ్బు కావాలంటూ యువకుడికి తరచూ ఫోన్‌ చేసి వేధించారు. సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేస్తే ఎక్కడ పరువు పోతుందో అని చెప్పి భయపడిన యువకుడు గ్రామంలోని పొలంలో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tagged woman, NIzamabad, online, Chat

Latest Videos

Subscribe Now

More News