ఏ దేశానిదో చెప్పడానికి కాస్త సమయం ఇవ్వండి

ఏ దేశానిదో చెప్పడానికి కాస్త సమయం ఇవ్వండి

ప్రభుత్వాన్ని కోరిన ఆన్‌లైన్‌ కంపెనీలు
డీపీఐఐటీతో సమావేశమైన సంస్థలు

బెంగళూరు: తమ ప్లాట్‌‌ఫామ్‌‌లపై అమ్మే ప్రొడక్ట్‌‌లు ఏ దేశానికి చెందినవో(కంట్రీ ఆఫ్ ఒరిజిన్) లేబులింగ్ ఇవ్వడానికి మరింత సమయం కావాలని టాప్ ఆన్‌‌లైన్‌‌ కంపెనీలు ఫ్లిప్‌‌కార్ట్, అమెజాన్‌‌లు ప్రభుత్వాన్ని కోరాయి. డిపార్ట్‌‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్(డీపీఐఐటీ)తో జరిగిన వర్చువల్ మీటింగ్‌‌లో ఈ కోరికను వెల్లడించినట్లు తెలిసింది. చైనీస్ దిగుమతులను నిషేధించేందుకు కంట్రీ ఆఫ్ ఒరిజిన్ లేబులింగ్ ఇవ్వాలని పెద్ద ఎత్తున ప్రతిపాదనలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ–కామర్స్ కంపెనీలతో డీపీఐఐటీ మీటింగ్ నిర్వహించింది. డీపీఐఐటీ మీటింగ్‌‌లో రిలయన్స్ రిటైల్, జియో ప్లాట్‌‌ఫామ్స్, టాటా క్లిక్‌‌లకు చెందిన ఎగ్జిక్యూటివ్‌‌లతో పాటు శ్నాప్‌‌డీల్, ఉడాన్, స్విగ్గీ, జొమాటో, బిగ్‌‌బాస్కెట్, గ్రోఫర్స్‌‌లకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ఈ రిక్వైర్‌‌‌‌మెంట్‌‌ కోసం కనీసం 4 నుంచి 5 నెలల సమయం కావాలని ఆన్‌‌లైన్ రిటైలర్స్ కోరినట్టు ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఆఫ్‌‌లైన్‌‌లో కన్జూమర్లు ఆ ప్రొడక్ట్‌‌ ఎక్కడ తయారైందో చూసుకుని కొనుగోలు చేస్తారని, కానీ ఈకామర్స్ వెబ్‌‌సైట్లలో కూడా ఇదే వివరాలు అందివ్వాలని సీనియర్ ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. తమ ప్లాట్‌‌ఫామ్స్‌‌లోని అమ్మకందారులతో చర్చించి, పదిహేను రోజుల్లో ఫీడ్‌‌బ్యాక్ తెలుపుతామని కంపెనీలు చెప్పాయని అన్నారు. ప్రభుత్వం ఈ ప్రతిపాదనను లీగల్ మెట్రలాజీ(ప్యాకేజ్డ్ కమోడిటీస్) రూల్స్ 2011 కింద తీసుకురావాలని చూస్తోంది. ఈ క్లాజ్‌ను ఈ–కామర్స్ పాలసీలో తీసుకురావాలని ప్లాన్ చేస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ స్కీమ్ ఆత్మనిర్భర్ పాలసీలో భాగమై ఉంటుందని పేర్కొన్నాయి. ఈ మీటింగ్ వివరాలపై స్పందించేందుకు శ్నాప్‌‌డీల్ అధికార ప్రతినిధి నిరాకరించారు.

For More News..

ఐటీ ఆన్‌లైన్‌ కోర్సులకు మస్తు డిమాండ్

చైనా మాల్‌ తగ్గించేందుకు కొత్త ప్లాన్

ఫిక్సింగ్‌‌‌‌ను ఇండియాలో క్రైమ్‌‌‌‌గా చూడాలి