ఆన్​లైన్ ​క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

ఆన్​లైన్ ​క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
  • ఆన్​లైన్ ​క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
  • రూ. 1.12 కోట్ల నగదు,  రెండు కార్లు, 14  సెల్ ఫోన్స్ స్వాధీనం
  • వివరాలు వెల్లడించిన  నల్గొండ ఎస్పీ అపూర్వ రావు

నల్గొండ అర్భన్, వెలుగు  :  నల్లగొండ జిల్లాలో ఆన్​లైన్​క్రికెట్​బెట్టింగ్​నిర్వహిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.1.12 కోట్ల నగదు, 2 కార్లు, 14 సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను జిల్లా పోలీస్​ఆఫీసులో ఎస్పీ కె.అపూర్వరావు తెలియజేశారు. మిర్యాలగూడ వన్​టౌన్‌‌ పరిధిలోని మయూరినగర్ హౌసింగ్ బోర్డులో ఉన్న సాయిదత్త అపార్ట్‌‌మెంట్‌‌ ఫ్లాట్ నంబర్​303లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారం అందింది. దీంతో వన్​టౌన్ సీఐ రాఘవేందర్, ఎస్ఐ శివ తేజ్, టాస్క్ ఫోర్స్ సిబ్బంది, కట్టంగూర్ ఎస్ఐ విజయ్ కుమార్, మిర్యాలగూడ టూ టౌన్ ఎస్​ఐ వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ రవి, రహమాన్​ రైడ్​ చేశారు.

బెట్టింగ్ నిర్వహిస్తున్న 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో మిర్యాలగూడ మయూరినగర్​కు చెందిన బంటు రాజేశ్​, ఖమ్మం జిల్లా బోనకల్​కు చెందిన కోల సాయికుమార్, రాచబంతి జీవన్​కుమార్, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన నోట్ల సత్యనారాయణ, ఖమ్మం జిల్లాకు చెందిన శాకమూరి ఉదయ్​కుమార్​, మిర్యాలగూడ గాంధీనగర్​కు చెందిన బంటు సంతోష్​, గంధం నవీన్​కుమార్​, బంటు వంశీకృష్ణ, ఖమ్మం జిల్లా ప్రకాశ్​నగర్​కు చెందిన కొండవేటి రాజేశ్​ఉన్నారు.

ఇందులో బంటు రాజేశ్​కుమార్​మూడేండ్లుగా ఆన్‌‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌‌ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. గతంలో రాజేశ్​కుమార్​పై హైదరాబాద్​సరూర్ నగర్ పోలీసు స్టేషన్ లో బెట్టింగ్ కేసు నమోదైందని ఎస్పీ చెప్పారు.  ముఠాను పట్టుకున్న పోలీసులను అభినందించారు.