
బషీర్‌బాగ్, వెలుగు: ఆన్లైన్ హనీట్రాప్ఉచ్చులో పడి ఓ యువకుడు మోసపోయాడు. అసిఫ్ నగర్‌కు చెందిన 25 ఏండ్ల యువకుడికి తొలుత వాట్సాప్‌లో వీడియో కాల్వచ్చింది. ఇందులో ఓ మహిళ న్యూడ్‌గా కనిపిస్తూ యువకుడితో మాట్లాడింది.
అనంతరం దానిని స్క్రీన్ రికార్డ్ చేసి, వీడియోను సర్క్యులేట్ చేస్తామని బెదిరించారు. వీడియో డిలీట్ చేయడానికి డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో భయపడిన యువకుడు మొదట రూ.8,500, ఆ తర్వాత పలు దఫాలుగా రూ.లక్ష బదిలీ చేశాడు.
స్కామర్లు మరింత డబ్బు డిమాండ్ చేయడంతో యువకుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపారు.