ఆఫీసుల రీ ఓపెన్​పై ఆన్​లైన్​ సర్వే

ఆఫీసుల రీ ఓపెన్​పై ఆన్​లైన్​ సర్వే
  • బ్యాక్​ టు ఆఫీసు
  • సిటీలో ఐటీ కంపెనీల రీ ఓపెన్​పై ఆన్​లైన్​ సర్వే
  • 500  ఆఫీసులకు ఫామ్స్​పంపిన టీఎఫ్ఎంసీ 
  • మార్చిలో కొన్ని.. ఏప్రిల్ మరికొన్ని షురూ 
  • ఎంప్లాయీస్​ ఫీడ్ ​బ్యాక్​కు ఇంపార్టెన్స్​

హైదరాబాద్, వెలుగు: ఐటీ  కంపెనీలు త్వరలోనే వర్క్​ ఫ్రమ్​ఆఫీసు స్టార్​చేయనున్నట్టు తెలుస్తోంది. థర్డ్ వేవ్  ముప్పు పోయిందని, ఆఫీసులు ఓపెన్​చేసుకోవచ్చని హెల్త్ డైరెక్టర్ చెప్పగా, దీంతో ఐటీ సెక్టార్ రెడీ అవుతోంది.  ఎంప్లాయీస్​ను వర్క్​ఫ్రమ్​ హోమ్ నుంచి ఆఫీసులకు పిలిచేందుకు చర్యలు చేపట్టాయి. ఇప్పటికే చిన్న కంపెనీల ఆఫీస్​లు రీ ఓపెన్​కాగా..  ఎంఎన్‌సీలు మెల్లిగా స్టార్ట్​చేస్తున్నాయి. మార్చి, ఏప్రిల్ వరకు అన్ని కంపెనీలు రీ ఓపెన్​అవ్వొచ్చనే  అంచనా ఉంది. 

ఫీడ్​ బ్యాక్​ తెలుసుకునేందుకు..  
కంపెనీ మేనేజ్​మెంట్ల ఏర్పాట్లపై, ఎంప్లాయీస్​ఆలోచనపై టీఎఫ్ఎంసీ (తెలంగాణ ఫెసిలిటీస్ మేనేజ్‌మెంట్ కౌన్సిల్) బ్యాక్ టు ఆఫీస్ సర్వేను చేస్తోంది. ఇందులో దాదాపు 500లకు పైగా కంపెనీలకు ఆన్​లైన్​లో సర్వే ఫామ్​ను పంపింది. అందులో క్వశ్చనీర్​ను కూడా పంపించారు. ఒక్కో ఆఫీస్ లో 10 నుంచి 15మంది ఎంప్లాయీస్​ నుంచి ఫీడ్ బ్యాక్ ని తీసుకోనుంది. వారం రోజుల్లో సర్వేని కంప్లీట్ చేయాలని చూస్తు న్నట్టు టీఎఫ్ఎంసీ తెలిపింది. కంపెనీల రీ ఓపెనింగ్ కు సర్వే కూడా ఉపయోగపడుతుందని, దీని ద్వారా ఎంప్లాయీస్​ఆలోచనలు తెలుస్తాయని పేర్కొంది. 

కొత్త విధానాలతో.. 
ఒకేసారి 100 శాతం ఎంప్లాయీస్ తో కంపెనీలు రీ ఓపెన్ అవడం కష్టమే అంటున్నారు ఐటీ నిపుణులు. మార్చి ఫస్ట్​ వీక్​లో కొన్ని,  ఏప్రిల్ లో మిగతావి ఓపెన్​ కానున్నాయి.  రీ ఓపెనింగ్​తర్వాత ఆఫీస్​లో కొత్త విధానాలు కనిపించనున్నాయి.  రెండు రోజులు ఆఫీస్, మూడు రోజులు  వర్క్​ ఫ్రమ్​ హోం ఉండే అవకాశం ఉంది. ఇందువల్ల ఎంప్లాయీస్ కి ఆఫీస్ వాతావరణం తిరిగి అలవాటు అవుతుందని మేనేజ్ మెంట్లు ఆలోచిస్తున్నాయి. ముందు 15 శాతం ఎంప్లాయీస్ తో స్టార్ట్ చేసి డిసెంబర్ కల్లా 100 శాతం చేయాలని చూస్తున్నాయి.  దీంట్లో భాగంగా కొన్ని ఎంఎన్‌సీలు ఇప్పుడిప్పుడే ఎంప్లాయీస్ ను  ఆఫీస్‌లకు పిలుస్తున్నాయి. నెల ముందు నుంచే ముందస్తుగా  ప్రిపేర్ చేస్తున్నాయి. సిటీ లో తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు వంటి ఇతర ప్రాంతాలకు చెందిన ఐటీ ఎంప్లాయీస్​ఉన్నారు. కంపెనీలు వాళ్లకు ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి. బ్యాక్ టు ఆఫీస్ సర్వేలో భాగంగా ఎంప్లాయీస్​ ఫీడ్ బ్యాక్ ని కూడా టీఎఫ్ఎంసీ తీసుకుంటోంది. 

మార్చిలో ఉండొచ్చని.. 
మాదాపూర్ లోని సాఫ్ట్ వేర్ కంపెనీలో డెవలపర్‌‌గా చేస్తున్నా.  లాక్ డౌన్ టైమ్​లోనే జాబ్ లో జాయిన్ అయ్యా.  ఒక్కసారి కూడా ఆఫీస్ కి వెళ్లి వర్క్ చేయలేదు. ఎప్పుడెప్పుడు కంపెనీ ఓపెన్ అవుతుందా అని ఎదురుచూస్తున్న.   మార్చిలో ఓపెన్ అవ్వొచ్చని అంటున్నారు. ఈ వారంలో ఆఫీసులో మేనేజ్​మెంట్​డిన్నర్ కూడా అరేంజ్ చేస్తోంది . అక్కడ మాకు ఆఫీస్ ఎప్పుడు ఓపెన్ అనే ఇన్ఫర్మేషన్ చెప్తారని అనుకుంటున్నా.
- అర్షిత, సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్​

మేనేజ్​మెంట్లకు మెయిల్ చేశాం 
ఇప్పటికే సర్వే నిర్వహించాం. ఇప్పుడు డిజిటల్​ఫామ్​ని కంపెనీ మేనేజ్​మెంట్లకు మెయిల్ లో పంపాం. ఫీడ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నాం. ఇప్పటివరకు వచ్చిన ఫీడ్ బ్యాక్ లో హైబ్రిడ్ మోడల్ లో స్టార్ట్ అవ్వనున్నట్లు సమాచారం. ఏప్రిల్ లో 10 నుంచి 15శాతం ఎంప్లాయీస్ తో మొదలై డిసెంబర్ నాటికి పూర్తి కావచ్చని అనుకుంటున్నాం. 
- సత్యనారాయణ, ప్రెసిడెంట్, టీఎఫ్ఎంసీ