స్కిల్ మిత్రా యాప్ ద్వారా కూలీలకు ఆన్ లైన్ ట్రైనింగ్

స్కిల్ మిత్రా యాప్ ద్వారా కూలీలకు ఆన్ లైన్ ట్రైనింగ్

మూడు నెలల క్రితం వరకు రోడ్లపై ఎక్కడ చూసినా సొంతూళ్లకు తరలిపోతున్న వలస కార్మికులే కనిపించారు. లాక్ డౌన్, కోవిడ్ 19 ఇన్ఫెక్షన్లు పెరగడంతో లక్షలమంది వలసకార్మికులు పల్లె బాట పట్టారు. పొట్ట కూటి కోసం సిటీకొచ్చిన వాళ్లంతా మరి పల్లెల్లో ఇప్పుడేం చేస్తున్నారు. ఇంటిని ఎలా నెట్టు కొస్తున్నారు.. ఈ విషయం గురించి ఆలోచించిన వాళ్లు చాలా తక్కువే. కానీ, జైపూర్ కు చెందిన షిప్రా శర్మ భూటాని మాత్రం కేవలం ఆలోచించడమే కాదు.. వాళ్లకోసం ఓ ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్ ఏర్పాటు చేసి ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. వాళ్లలోని స్కిల్స్ ను బయటకు తీసి వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడేలా చేస్తోంది.

కరోనా వలస కార్మికుల జీవితాన్నిచిందరవందర చేసింది అనడంలోఅనుమానమే లేదు. నెలల పాటు ఫ్యాక్టరీలు, బిజినెస్ లు మూతబడటంతో ఆ ఎఫెక్ట్​ వలస కార్మికులపైనే ఎక్కువగా పడింది.దాంతో ఇళ్లు గడవక కొందరు, వైరస్ భయానికి మరికొందరు వేలకిలోమీటర్లునడిచి సొంతూళ్లకి చేరుకున్నా రు. అయితే ఇలా ఉపాధి కోల్పోయిన వాళ్లకి షిప్రా శర్మ తను ఏర్పాటు చేసిన ‘స్కి ల్ మిత్రా’ ద్వారా ట్రైనింగ్ ఇస్తున్నారు. ట్రైనింగ్ పూర్తయ్యాకవాళ్లకి అమెజాన్, పేటీఎం, పోర్టియా,రాజస్థాన్ టెక్స్, జస్ట్ క్లీన్, స్విగ్గి, జొమాటో..ఇలా లాభాల్లో ముందుకు వెళుతున్నకంపెనీల్లో ఉద్యోగావశాలు కల్పిస్తున్నారు.ఇలా ఇప్పటివరకు 20 వేలమందిని కొత్త ఉద్యోగాల్లో చేర్పించారు షిప్రా. ఆమె గురించి మరిన్ని విషయాలు.

ఉపాధి ఇలా…

ఎకనామిక్స్ ప్రొఫెసరైన షిప్రా చిన్నప్పట్నుం చీ సోషల్ సర్వీస్ లో యాక్టివ్ గా ఉండేది. సాయమంటూ ఎవరు అడిగి నా తనకు తోచినంత చేతిలో పెట్టేది. ఇంతకుముందు కూడా నేషనల్ స్కి ల్స్ డెవలప్ మెం ట్ కార్పొరేషన్ తో కలిసి ఖైదీలు, ఒంటరి ఆడవాళ్లకి, యుద్ధ బాధిత మహిళలకి ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పించింది. ఇప్పుడు ‘స్కి ల్ మిత్రా’ యాప్ ద్వారా వలస కూలీలకు మాస్క్ లు, పీపీఈ కిట్స్ ఎలా తయారు చేయాలో నేర్పిస్తోంది. ఇప్పటివరకూ రాళ్లు కొట్టి జీవించిన కూలీ డెలివరీబాయ్ గా ఎలా మారొచ్చు.. అనే అంశాలను కూడా ఈ యాప్ ద్వారా చెప్తోంది. వారానికి ఒకటి రెండు క్లాస్ ల చొప్పున ఐదు లాంగ్వేజెస్ లో ఈ ఆన్ లైన్ ట్రైనింగ్ ఇస్తోంది. ఉద్యోగాలే కాదు స్వయంగా ఉపాధి పొందా లనుకునే వాళ్లకి కూడా ఓ దారి చూపిస్తోంది. ప్రొడక్ట్ ఎలా తయారు చేయాలి. రిటైల్ దుకాణాలను వాటిని ఎలా చేరవేయాలి. ఎంత డబ్బులు తీసుకోవచ్చన్నవిషయాలు కూడా ఈ స్కి ల్ మిత్రా యాప్ ద్వారా వివరంగా చెప్తోంది.

కాంటాక్ట్ అవుతున్నారు…

చాలా కంపెనీలు రిక్రూట్ మెం ట్ కోసం ఇప్పుడు స్కి ల్ మిత్రానే ఆశ్రయిస్తున్నాయి. షిప్రా మిశ్రా రాష్ ట్ర ప్రభుత్వాల నుంచి 55 లక్షల మంది కూలీల వివరాలను కలెక్ట్ చేసింది. ఏ రాష్ట్రం నుంచి ఏ రాష్ట్రానికి వలసకూలీలు తిరిగివెళ్లారు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నా రు లాంటి వివరాలన్నీ యాప్ లో ఉంచింది. ఈ యాప్ లో లభించే డేటాబేస్ ద్వారా ఏ ప్రాంతంలో ఎంత మందికూలీలున్నారో తెలుసుకుని రిక్రూట్ చేసుకుంటున్నా యి కంపెనీలు.

నెలకు 10 నుంచి 15 వేలు…

ఇప్పటివరకు 20 వేలకు పైగా వలసకార్మికులు షిప్రా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు. ఇప్పుడు వాళ్లంతా ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు కూడా..బతుకు దెరువు ఏంటనే ప్రశ్నలతో సొంతూళ్లకు చేరిన వాళ్లంతా ఇప్పుడు నెలకు 10 నుంచి 15వేల రూపాయల వరకూ సంపాదిస్తున్నా రు.

కేవలం వీళ్లకే కాదు…

కేవలం వలస కార్మికులనే కాదు సెంట్రల్ జైల్లోని మహిళా ఖైదీలను బ్యూటీషియన్స్, కుకింగ్ ఎక్స్ పర్స్ట్ గా మారుస్తుంది షిప్రా.ఇంట్రెస్ట్ ను బట్టి కొందరికి బ్యూటీ కోర్సులునేర్పిస్తే మరికొందరికి పచ్చళ్లు, పొడులు,పేపర్, వెదురు ప్రొడక్స్ట్ వంటి వాటిపై ట్రైనింగ్ ఇస్తున్నారు. వాళ్లు తయారు చేసిన ప్రొడక్స్ట్ ను.. జైలు ముందున్న షాప్స్ లోఅమ్ము తున్నారు కూడా.

ఫ్యూచర్ ప్లాన్స్…

ఉపాధి కోల్పోయిన వాళ్లకి ఉద్యోగాలు కల్పించాలనే ప్రక్రియను ముందు ముందుమరింత వేగవంతం చేయడానికి జాబ్ ఫెస్టివల్స్ ను నిర్వహించాలని చూస్తున్నారు షిప్రా. ఇకపై పూర్తిగా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ద్వారా ఉపాధి కల్పించనున్నారు. కూలీలను ప్లంబర్లు, సిఎన్ సి ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్లు,బ్యూటీషియన్లుగా మార్చే ఆలోచనలో కూడాఉన్నాం అని చెప్తున్నారు షిప్రా.