ఆన్‌లైన్‌లో దేనికోసం సెర్చ్ చేస్తున్నారో తెలుసా?

ఆన్‌లైన్‌లో దేనికోసం సెర్చ్ చేస్తున్నారో తెలుసా?

షూటింగ్‌ లు నిలిచిపోవటంతో బుల్లితెర, వెండితెరల మార్కెట్‌ పై ఆ ప్రభావం పడింది. కరోనా హాలీడేస్‌ , లాక్‌ డౌన్‌ వల్ల వ్యూయర్స్‌ కి ఎంటర్‌ టైన్‌ మెంట్‌
కరువొచ్చింది. అడపా దడపా రిలీజ్‌ అవుతున్న వెబ్‌ సిరీస్‌ లు, సినిమాలతో ఆన్‌ లైన్ వ్యూయర్స్‌ .. పాత సీరియల్ ఎపిసోడ్స్, సినిమాలతో టీవీ వ్యూయర్స్‌
గడిపేస్తున్నారు . అయితే ఇంతకాలం ఎలాగోలా నెట్టుకొచ్చిన వ్యూయర్స్‌ .. ఇప్పుడు రూట్‌ మా ర్చారు. ముఖ్యం గా ఆన్‌ లైన్‌ వ్యూయర్స్‌ ఇంటర్నెట్‌ లో విపరీతంగా సెర్చ్‌‌ చేస్తున్నారు . ఇంతకీ ఆ వెతుకులాట దేనికోసం..

ఎంటర్‌‌టైన్‌‌మెంట్‌‌లో భాగంగా వ్యూయర్స్‌‌ కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ఆన్‌‌లైన్‌‌లో మంచి కంటెంట్ కోసం ఆరా తీస్తున్నారు. రకరకాల జానర్లు, పాత.. కొత్త  వెబ్‌‌సిరీస్‌‌లు, సినిమాలు, ఆఖరికి కార్టూన్లు, డాక్యుమెంటరీలనూ వదలకుండా తిరగేస్తున్నారు.  ఈ క్రమంలో యాక్టర్లు.. డైరెక్టర్ల పేర్లతో కంటెంట్‌‌ సెర్చింగ్‌‌ ఎక్కువగా ఉంటోంది. యాక్షన్‌‌, థ్రిల్లర్‌‌ కహానీలకు వ్యూయర్‌‌షిప్‌‌ ఎక్కువగా ఉంటోంది.   అల్రెడీ చూసిన వాళ్లు షేర్‌‌ చేసే రివ్యూలు, ఒపీనియన్లతో మరికొంతమంది వాటిని చూసేస్తున్నారు. పరోక్షంగా సోషల్ మీడియా పేజీల ప్రమోషన్లు కూడా ఆన్‌‌లైన్‌‌ వ్యూయింగ్‌‌ పెరగడానికి కారణమవుతోంది.  ఆన్‌‌లైన్‌‌ వ్యూయర్‌‌షిప్‌‌ దెబ్బకి టీవీ వ్యూయర్‌‌షిప్‌‌ అమాంతం తగ్గింది.  అయినప్పటికీ రూరల్‌‌, అర్బన్‌‌, సెమీ–అర్బన్‌‌ ఏరియాల్లో రెగ్యులర్‌‌గా టీవీ ప్రోగ్రామ్స్‌‌ చూసేవాళ్లు ఉంటున్నా ..  అది మునుపటి స్థాయిలో ఉండట్లేదని సర్వేలు చెప్తున్నాయి.

ఆన్‌‌లైన్‌‌లో..

ఈ లాక్‌‌డౌన్‌‌ టైంలో ఆన్‌‌లైన్ యూజర్లలో.. 60 శాతం కొత్త వాళ్లే కావడం విశేషం.  కరోనా వేళ అటు థియేటర్లు లేక ఇటు కొత్త సినిమాలు రాక స్ట్రీమింగ్‌‌ సర్వీసుల వైపు మళ్లుతున్నారంతా.  అయితే ఒకప్పుడు మెట్రో నగరాలు, టైర్‌‌–2 నగరాలకు మాత్రమే పరిమితమైన ఓటీటీ ఎంటర్‌‌టైన్‌‌మెంట్‌‌..  గత కొన్నిరోజుల్లో గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించింది. అందులోనూ సెలక్టివ్‌‌ కంటెంట్‌‌కి విపరీతమైన ఆదరణ ఉంటోంది.  యూట్యూబ్‌‌తో పాటు  హాట్‌‌స్టార్‌‌, జీ5, అమెజాన్‌‌ ప్రైమ్‌‌ వీడియో, నెట్‌‌ఫ్లిక్స్‌‌, లాంటి ఆన్‌‌లైన్‌‌ స్ట్రీమింగ్‌‌ సర్వీసులకు ఆదరణ పెరిగింది. మరోవైపు సోషల్ మీడియా కంటెంట్‌‌ను షేర్‌‌ చేసేవాళ్లూ పెరిగిపోగా.. టోరంట్‌‌ లింకులు, టెలిగ్రామ్ లింకుల నుంచి కంటెంట్‌‌ను సేకరిస్తున్నవాళ్లు అదే రేంజ్‌‌లో ఉండటం గమనార్హం.

బోరింగ్‌‌ బుల్లితెర!

సీరియల్స్‌‌, రియాలిటీ షోలు, అవార్డ్‌‌ ఫంక్షన్‌‌లు, సినిమాలు.. రిపీట్ టెలికాస్ట్‌‌ ప్రోగ్రామ్స్‌‌తో మొహం వాచిపోయి ఉన్నారు ఆడియెన్స్‌‌.  ఫైనల్‌‌గా టీవీల్లో ఎక్కువగా చూస్తున్నది న్యూస్‌‌ చానెల్స్‌‌, నేతల లైవ్‌‌ ప్రెస్‌‌ మీట్లు మాత్రమే. అది కూడా కరోనా వార్తలు, లాక్‌‌డౌన్‌‌ అప్‌‌డేట్స్‌‌ కోసమే కావడం కొసమెరుపు. అయితే కొన్ని చానెల్స్‌‌ మాత్రం నోస్టాల్జియాతో వ్యూయర్స్‌‌ని ఆకట్టుకుంటున్నాయి.  పాత ప్రోగ్రామ్స్‌‌ని రీ–టెలికాస్ట్‌‌ చేస్తుండటంతో వాటికి క్రేజ్‌‌ ఉంటోంది. కొన్నేళ్లుగా వ్యూయర్‌‌షిప్‌‌ లిస్ట్‌‌లో చోటు దక్కించుకోలేని ‘దూరదర్శన్‌‌’ టీఆర్పీ.. అమాంతం టాప్‌‌లోకి రావడానికి కారణం ఈ నోస్టాల్జియా మంత్రమే. ఆ తర్వాతే మిగతా చానెల్స్‌‌ కూడా దూరదర్శన్‌‌ రూట్‌‌నే ఫాలో అయ్యాయి.

తగ్గిన సెల్ఫ్‌‌ కంటెంట్‌‌!

యూట్యూబ్‌‌, టిక్‌‌టాక్, హలో.. ఇలా సెల్ఫ్‌‌ మేడ్‌‌ కంటెంట్‌‌ యాప్‌‌లలో మనవాళ్ల కంటెంట్‌‌ తగ్గుముఖం పడుతోంది. అదే టైంలో ఫేస్‌‌బుక్‌‌, ట్విట్టర్‌‌ యూజర్స్‌‌ యాక్టివేషన్‌‌ ఎక్కువ అవుతోంది. మరీ ముఖ్యంగా వీడియో కంటెంట్ జనరేట్‌‌ చేసేవాళ్లు యాక్టివ్‌‌గా ఉండట్లేదు. ఏకంగా అకౌంట్లను డీ–యాక్టివేట్ చేసినవాళ్లు కొందరైతే.. గ్యాప్ ఇచ్చి ఆల్టర్‌‌నేట్‌‌ సరదాలతో గడిపేస్తున్నారు మరికొందరు. మునుపెన్నడూ లేనంతగా టిక్‌‌ టాక్‌‌ అకౌంట్ల డీ–యాక్టివేషన్‌‌ గత వారం, పదిరోజుల్లో పెరిగిందని ఓ ప్రైవేట్‌‌ కన్సల్టెన్సీ సర్వేలో బయటపడింది. ‘లాక్‌‌డౌన్‌‌ పిరియడ్‌‌లో ఫీడ్స్ చూసేవాళ్లు తగ్గారు.  ఆన్‌‌లైన్‌‌ గేమ్స్‌‌కి ప్రయారిటీ పెరిగింది.  అయితే ఈ ప్రభావం అంతా పరిస్థితులు నార్మల్‌‌ అయ్యే వరకే ఉండొచ్చు’ అని అంచనా వేస్తున్నారు ఎక్స్‌‌పర్ట్స్‌‌.

అడల్ట్‌‌.. డౌన్‌‌

లాక్‌‌డౌన్‌‌ తొలినాళ్లలో అడల్ట్‌‌ సైట్లకు విపరీతమైన వ్యూయర్‌‌షిప్‌‌ పెరిగిందని కొన్ని సర్వేలు చెప్పాయి.  కానీ, లాక్ డౌన్‌‌ మధ్యలోనే ఆ వ్యూయర్‌‌షిప్‌‌ అమాంతం పడిపోయింది.  బహుశా అంతా ఇళ్లకే పరిమితం కావటంతో అడల్ట్ కంటెంట్‌‌కి వ్యూయర్స్‌‌ తగ్గిపోయి ఉంటారని అడల్ట్ సైట్‌‌ పోర్న్ హబ్‌‌ ఒక స్టేట్‌‌మెంట్ రిలీజ్‌‌ చేసింది. అయితే ఉల్లూ, ఆల్ట్‌‌ బాలాజీ, ఎమ్‌‌ఎక్స్‌‌ ప్లేయర్‌‌లాంటి లోకల్‌‌ యాప్స్‌‌లో అడల్ట్‌‌ కంటెంట్‌‌ సిరీస్‌‌లకు మాత్రం వ్యూయర్‌‌షిప్‌‌ పెరగడం కొసమెరుపు.

ఆయిలీ స్కిన్ కు చెక్ పెట్టాలంటే..