సర్కారు ఫండ్స్ రిలీజ్ చేయక ఆగిన డబుల్ బెడ్రూంలు

 సర్కారు ఫండ్స్ రిలీజ్ చేయక ఆగిన డబుల్ బెడ్రూంలు
  • ఏడేండ్లలో ఇచ్చినయి 13 వేలే
  • ఎలక్షన్లు వచ్చినప్పుడే సర్కారు హడావుడి
  • జిల్లాల్లో పూర్తయినా లబ్ధిదారులకు ఇస్తలే
  • కొన్నిచోట్ల ఇండ్లలోకి చేరిపోతున్న స్థానికులు
  • ఇంకా నిర్మాణ దశలోనే 1.88 లక్షల ఇండ్లు
  • డబుల్ ఇండ్ల కోసం ఇప్పటిదాకా 24 లక్షలకు పైగా అప్లికేషన్లు

2019 ఏప్రిల్‌ నాటికి డబుల్‌ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తం. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని పేదల కోసం లక్ష ఇండ్లు కడ్తున్నం. త్వరగా పూర్తి చేసేందుకు రాత్రిపూట కూడా పనులు కొనసాగిస్తున్నం. లబ్ధిదారులకు జాగా ఉంటే రూ.5 లక్షలు ఇస్తం. వారు అక్కడే ఇల్లు కట్టుకోవచ్చు. 2018 డిసెంబర్ 2న అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పేదలకు డబుల్‌ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని సర్కారు హామీ ఇచ్చి ఏడేండ్లవుతున్నా.. ఇప్పటిదాకా పంపిణీ చేసింది 13,726 మందికి మాత్రమే. ఇంకా 1,88,343 ఇండ్లు నిర్మాణ దశలోనే ఉన్నాయి. సర్కారు నిధులివ్వకపోవడంతో పనులు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. ఎలక్షన్లు వచ్చినప్పుడే సర్కారు డబుల్  బెడ్రూంఇండ్ల గురించి మాట్లాడుతుందని, తర్వాత పట్టించుకోవడం లేదని జనం మండిపడుతున్నారు. కొన్నిచోట్ల నిర్మాణం పూర్తయిన ఇండ్లను కూడా లబ్ధిదారులకు అందించడం లేదు. దీంతో తమకు ఇండ్లను ఇంకెప్పుడు ఇస్తారంటూ లబ్ధిదారులు నిలదీస్తున్నారు.
లక్షల్లో దరఖాస్తులు.. వందల్లో ఇండ్లు
పేదలకు డబుల్‌ బెడ్రూం ఇండ్లు ఇస్తామని 2014 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్‌ఎస్‌ హామీ ఇచ్చింది. జిల్లాల్లో 2 లక్షలు, హైదరాబాద్‌లో లక్ష డబుల్‌ ఇళ్లను నిర్మించి ఇస్తామని 2018 ఎన్నికల్లోనూ చెప్పింది. కానీ హామీ పూర్తిగా అమలు కాలేదు. మరోవైపు డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. కానీ ఆయా ప్రాంతాల్లో నిర్మించిన ఇండ్లు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. 
రాష్ట్రవ్యాప్తంగా నిర్మిస్తున్న ఇండ్ల సంఖ్య 2,91,057. కానీ అప్లికేషన్లు భారీగా వస్తున్నాయి. నియోజకవర్గాల్లో వందల్లో నిర్మిస్తున్న ఇండ్లను ఎట్ల ఇవ్వాలనేది మంత్రులు, లోకల్ ఎమ్మెల్యేలకు అర్థం కావడం లేదు. జిల్లాలు, జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడ మీటింగ్ పెట్టినా డబుల్ ఇండ్ల కోసం లక్షల్లో దరఖాస్తులు వస్తున్నాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూం ఇండ్ల కోసం దాదాపు 7 లక్షల అప్లికేషన్లు వచ్చినట్లు ఆఫీసర్లు చెప్తున్నరు. అన్ని జిల్లాలను తీసుకుంటే ఈ సంఖ్య 24 లక్షలు దాటుతుందని హౌసింగ్ డిపార్ట్​మెంట్ ఆఫీసర్ ఒకరు ‘వెలుగు’కు తెలిపారు.
ఆ మూడు నియోజకవర్గాల్లోనే పంపిణీ
2014 సమగ్ర కుటుంబ సర్వే ప్రకారమే రాష్ట్రంలో ఇండ్లు లేని పేదలు 26.31 లక్షల మంది ఉన్నట్లు తేలింది. లబ్ధిదారులను కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంపిక చేయాల్సి ఉంది. కానీ నిర్మాణాలు పూర్తయిన చోట ఎక్కువ మంది లబ్ధిదారులు ఉండటం, ఇండ్లు తక్కువగా ఉండటంతో రేపు, మాపు అంటు వాయిదా వేస్తున్నరు. మరోవైపు డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం ఇప్పటిదాకా సర్కార్ స్పష్టమైన మార్గదర్శకాలేవీ విడుదల చేయలేదు. ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డు, రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డు, సొంతిల్లు లేకపోవడం వంటి డాక్యుమెంట్లను ప్రామాణికంగా తీసుకుంటున్నామని చెబుతున్నారు. అయితే సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్, మంత్రులు కేటీఆర్, హరీశ్​రావు నియోజకవర్గాల్లో ఇండ్లు కొన్ని నిర్మించి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మిగతా జిల్లాల్లో కట్టినా పంపిణీ చేయడం లేదు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ నిర్మాణం పూర్తయిన ఇండ్లు ఉన్నాయి. దాదాపు లక్ష ఇండ్లు పూర్తయి, లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా ఖాళీగా ఉన్నట్లు అధికారిక లెక్కలే వెల్లడిస్తున్నాయి.
ఫండ్స్ సగమే ఇచ్చిన్రు
డబుల్ బెడ్ రూం ఇండ్లకు సర్కార్ నుంచి సకాలంలో ఫండ్స్ రిలీజ్ కావడం లేదు. హడ్కో నుంచి అప్పులు తీసుకుని ఇండ్ల నిర్మాణాన్ని సర్కారు చేపట్టింది. ఇండ్లు లేని వారి కోసం కేంద్రం ఇచ్చిన ఫండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నూ డబుల్ ఇండ్లకు మళ్లించింది. 2.91 లక్షల ఇండ్లకు రూ.19,126 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేయగా, ఇప్పటిదాకా రూ.10 వేల కోట్లు ఖర్చు చేసింది. పనులు పూర్తి కావాలంటే మరో రూ.9 వేల కోట్లకు పైగా అవసరం ఉంది. ఈ ఏడాది బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.11 వేల కోట్ల కేటాయింపులు చూపినా.. ఈ మొత్తాన్ని బ్యాంకులు, రుణ సంస్థల నుంచి అప్పులుగా తీసుకోనున్నట్లు ఆఫీసర్లు చెప్తున్నరు.
ఇంకెప్పుడిస్తరంటూ..
కొన్ని ప్రాంతాల్లో నిర్మాణం పూర్తయి ఏండ్లు గడుస్తున్నా ఎవరూ పట్టించుకోవడంతో స్థానికులే డబుల్ ఇండ్లలో చేరిపోతున్నారు. తమకు అలాట్ అయినా ఇవ్వలేదని .. జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లిలో స్థానికులు ఇండ్లను ఆక్రమించుకున్నరు. ఇతర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని చోట్ల డబుల్ ఇండ్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయనే విమర్శలున్నాయి. మరికొన్ని చోట్ల లబ్ధిదారులకు ఇండ్లు ఇవ్వకముందే బీటలు వారుతున్నాయి.