టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ ఎన్నికల్లో 40 శాతమే పోలింగ్

టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ ఎన్నికల్లో 40 శాతమే పోలింగ్

హైదరాబాద్, వెలుగు :  తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్(టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ) ఎన్నికల పోలింగ్ ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 44,848 మంది రిజిస్టర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాక్టర్లు ఉండగా.. కేవలం 18,249(40.69 శాతం) మంది డాక్టర్లు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ శనివారం నుంచే మొదలు కావాల్సి ఉండగా.. అసెంబ్లీ ఎన్నికల కోడ్ ఉండడంతో లెక్కింపును వాయిదా వేస్తున్నట్టు రిటర్నింగ్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వి.శ్రీహరిరావు ప్రకటించారు. ఈ నెల 11న ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.

బ్యాలెట్ పేపర్ల లెక్కింపునకు కనీసం 3 నుంచి 4 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. మెడికల్ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మొత్తం 26 మంది సభ్యులు ఉంటారు. ఇందులో 13 మందిని ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. ఇంకో 13 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఇందుకోసం ఆగస్టు 14న నోటిఫికేషన్ విడుదల చేశారు. అదే నెల 21 నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు.

సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 15వ తేదీ వరకు బ్యాలెట్ పేపర్లను సీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కవర్లలో డాక్టర్ల అడ్రస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పంపించారు. ఓటు వేసిన బ్యాలట్ పేపర్లను, నవంబర్​ 30వ తేదీ లోపు కౌన్సిల్కు పోస్ట్ చేయాలని సూచించారు.