టీఆర్ఎస్ పార్టీతో కొట్లాడేది బీజేపీనే

టీఆర్ఎస్ పార్టీతో కొట్లాడేది బీజేపీనే

భారతీయ జనతా పార్టీలోకి ఎవరొచ్చినా స్వాగతిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. భువనగిరి మండలం బస్వాపురం శివారు నుంచి ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించడానికి ముందు బండి సంజయ్ కొన్ని కామంట్స్ చేశారు. ఉద్యమకారులను స్వాగతించే పార్టీ భారతీయ జనతా పార్టీ అని బండి సంజయ్ అన్నారు. పార్టీలోకి వచ్చే వారికి సముచిత స్థానం, గౌరవం ఇస్తామని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీతో కొట్లాడే పార్టీ బీజేపీ మాత్రమే అన్నారు. 

తెలంగాణ ఏ ఆశయం కోసం ఏర్పడిందో ఆ ఆశయ స్ఫూర్తిని ముఖ్యమంత్రి కేసీఆర్ దెబ్బతీస్తున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ మాత్రమే టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరాడుతుందని తెలిపారు. అన్ని వర్గాల కోసం బీజేపీ కొట్లాడుతుందన్న ఆయన.. ఉద్యమ ఆకాంక్షను తీర్చే పార్టీ భారతీయ జనతాపార్టీ అని ప్రజలు గుర్తిస్తున్నారని చెప్పారు.