అసెంబ్లీలోకి ఎమ్మెల్యేలు, అడ్వకేట్లకే పర్మిషన్..ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ సందర్భంగా నిర్ణయం

అసెంబ్లీలోకి  ఎమ్మెల్యేలు, అడ్వకేట్లకే పర్మిషన్..ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ సందర్భంగా నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ సందర్భంగా అసెంబ్లీలో ప్రవేశంపై కొన్ని నిబంధలనలు విధించారు. అసెంబ్లీ లోకి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మీడియా, విజిటర్లకు అనుమతి లేదని అసెంబ్లీ సెక్రటరీ నరసింహచార్యులు ప్రకటించారు. మీడియా పాయింట్ దగ్గర సైతం మాట్లాడేందుకు అనుమతి లేదన్నారు. 

ఈ మేరకు ఆదివారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఈ ఆంక్షలు సోమవారం నుంచి విచారణ పూర్తయ్యే వరకు వచ్చే నెల 6 వరకు అమల్లో ఉంటాయని ప్రకటనలో పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా అసెంబ్లీలో ఉన్న వాళ్ల పార్టీ ఆఫీసులోకి వచ్చేందుకు మాత్రమే అనుమతి ఉందని తెలిపారు.