శ్రీలంకలో పెట్రోల్ మంట.. ఇంకా ఒక్కరోజు మాత్రమే..

 శ్రీలంకలో పెట్రోల్ మంట.. ఇంకా ఒక్కరోజు మాత్రమే..

కొలంబో (శ్రీలంక):  ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక అతలాకుతలం అవుతోంది.  తాజాగా దేశంలో పెట్రోలు, డీజీల్ నిల్వలు కేవలం ఒక్కరోజుకు సరిపడ మాత్రమే ఉన్నాయని శ్రీలంక కొత్త ప్రధాని రణిల్ విక్రమ సింఘే ఆందోళన వ్యక్తంచేశారు. దిగుమతులకు చెల్లించడానికి డాలర్లు కూడా లేవని తెలిపారు.  ప్రధాని పదవి చేపట్టాక సోమవారం తొలిసారి ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.  వచ్చే నెలల్లో దేశం మరిన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రజలను హెచ్చరించారు. వచ్చే 2 నెలలు దేశానికి అత్యంత కష్టతరమైనవని విక్రమసింఘే అన్నారు. ద్రవ్యోల్బణం, సుదీర్ఘమైన విద్యుత్ కొరతతో పాటు ఆహారం, ఇంధనం,  మందులను పొందేందుకు 22 మిలియన్ల ప్రజలు తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  రెండు నెలలు ఓపికగా భరించాలని ఆయన ప్రజలను కోరారు. సంక్షోభంలో కూరుకుపోయిన దేశాన్ని రక్షించడమే తన లక్ష్యమని తెలిపారు.