విమానంలో ఒకే ఒక్కడు..

V6 Velugu Posted on May 28, 2021

  • టికెట్ ఖర్చు 18 వేలు.. ఫ్యూయల్ ఖర్చు 8 లక్షలు

అది 360 సీట్లున్న విమానం. కానీ, ప్రయాణించింది మాత్రం ఒక్కడే. అలాగని అతడు విమానంలోని అన్ని సీట్లు బుక్‌‌‌‌ చేసుకోలేదు. ఒక్క టికెట్ మాత్రమే బుక్ చేసుకున్నాడు. అయినా, ఎలా సాధ్యమంటే.. ముంబైకి చెందిన బవేష్‌‌‌‌ జవేరి ఈ నెల 19న ముంబై నుంచి దుబాయ్ వెళ్లాలనుకున్నాడు. దీనికోసం వారం ముందుగా గోల్డెన్ వీసాతో ఎమిరేట్స్‌‌‌‌కు చెందిన ఫ్లైట్‌‌‌‌లో ఎకానమీ టికెట్‌‌‌‌ బుక్‌‌‌‌ చేసుకున్నాడు. సరిగ్గా 19వ తేదీన ముంబై ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌కు చేరుకున్నాడు. అయితే, టిక్కెట్‌‌‌‌పై డేట్‌‌‌‌ సరిగ్గా లేకపోవడం వల్ల అక్కడి సెక్యూరిటీ సిబ్బంది ఆపేశారు. ఆ టైంలో వెంటనే ఎమిరేట్స్‌‌‌‌ వాళ్లకు ఫోన్‌‌‌‌ చేసి, తన వివరాలు చెప్పాడు. అప్పుడు విమాన సిబ్బంది నుంచి అనుమతి రావడంతో, జవేరిని సెక్యూరిటీ వాళ్లు లోపలికి రానిచ్చారు. విమానం ఎక్కిన జవేరికి ఫ్లైట్‌‌‌‌ సిబ్బంది చప్పట్లు కొడుతూ స్వాగతం చెప్పారు. ఆశ్చర్యానికి గురైన జవేరికి, కాస్సేపటికి అసలు సంగతి తెలిసింది. ఆ రోజు ఆ విమానంలో తనొక్కడే ప్యాసింజర్​ని అని. కొవిడ్ కారణంగా చాలామంది తమ ప్రయాణాల్ని వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో 360 సీట్లున్న బోయింగ్‌‌‌‌ 777 విమానంలో తనొక్కడే ఉన్నాడు. ప్యాసింజర్​ ఒక్కడే ఉన్నా రూల్‌‌‌‌ ప్రకారం విమానాన్ని రద్దు చేయకుండా తీసుకెళ్లడం విశేషం.

సరదాగా...
విమానంలో ఒక్కడే ఉండడంతో క్రూ అందరూ జవేరితో కబుర్లు చెప్పారు. ‘‘నాకు విమానం అంతా తిరిగే ఛాన్స్ ఇచ్చారు. పైగా అనౌన్స్‌‌‌‌మెంట్‌‌‌‌ టైంలో ఎప్పటిలా ప్యాసింజర్స్ అని కాకుండా, మిస్టర్‌‌‌‌‌‌‌‌ జవేరి అని నా పేరుతో పిలవడం బాగనిపించింది. జర్నీ ఎంతో సరదాగా సాగింది. ఇరవై ఏళ్లుగా జర్నీ చేస్తున్నా ఈ అనుభవం మాత్రం ఇదే తొలిసారి” అన్నాడు. సాధారణంగా దుబాయ్‌‌‌‌కు ఒక చార్డెడ్​ ఫ్లైట్ బుక్ చేసుకోవాలంటే దాదాపు 70 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ జర్నీకైన ఫ్యుయెల్ చార్జ్‌‌‌‌ 8 లక్షల పైనే. దానికి సిబ్బంది జీతాలు అదనం. అంత ఖర్చయినా... భరించి ఒక్క ప్యాసింజర్​ను డెస్టినేషన్​కు చేర్చారు. ఇంతకీ ఈ ప్రయాణానికి జవేరి ఖర్చు చేసిందెంతో తెలుసా..18వేల రూపాయలు.

 

Tagged , bhavesh javeri, mumbi to dubai flight, boing 777, one passenger in flight

Latest Videos

Subscribe Now

More News