
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ చేస్తున్న లేటెస్ట్ మూవీ ఊరు పేరు భైరవకొన. విలక్షణ సినిమాల దర్శకుడు వీఐ ఆనంద్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ యంగ్ హీరో తన ఆశలన్నీ ఈసినిమాపైనే పెట్టుకున్నాడు. నిజానికి ఈ హీరో హిట్టు చూసి చాలా ఏళ్ళే అవుతోంది. అయినా కూడా వరుస సినిమాలతో బాక్సాఫీస్ మీద దండయాత్ర చేస్తూనే ఉన్నాడు.
రీసెంట్ గా మైఖేల్ అనే పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ దర్శకుడు రంజిత్ జయకోడి తెరకెక్కించిన ఈ మూవీ పై సందీప్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. అంతే కాదు.. ఈసినిమా కోసం సిక్స ప్యాక్ చేసి అదరగొట్టాడు. అయినా కూడా తన ఫేట్ మారలేదు. దీంతో.. ఈసారి ఎలాగైన సాలిడ్ హిట్ కొట్టాలనే ఫిక్స్ అయ్యాడు సందీప్. ఇందులో భాగంగానే ఊరు పేరు భైరవకోన అనే హారర్ థ్రిల్లర్ ఫిలింతో రాబోతున్నాడు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్, సాంగ్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్స్ లో విజువల్స్ చాలా బాగున్నాయి. గరుడ పురాణం గ్రంథం చుట్టూ ఈ కథ జరగనుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఆ గ్రంథంలో మిస్ ఐన నాలుగు పేజీలే ఈ భైరవకోన కథ అంటూ సందీప్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఇక మొత్తంగా ఆడియన్స్ లో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా ఉంది టీజర్. మరి సినిమా ఎలా ఉండబోతుంది అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. వర్ష బొలమ్మ, కావ్య థాపర్, వెన్నల కిషోర్, వైవా హర్ష ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నాడు.